దేశవ్యాప్తంగా ఘనంగా దంతవైద్యుల దినోత్సవం
భారతదేశంలోనే అతిపెద్ద డెంటల్ నెట్‌వర్కింగ్ యాప్ “బిజ్బోల్” ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా డెంటల్ కాలేజీ విద్యార్థులకు మార్చి 1నుంచి 6 వరకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని 20 వేర్వేరు రాష్ట్రాల నుంచి వందకు పైగా దంత కళాశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం జరిగిన జాతీయ అంతర కాలేజీల క్విజ్ పోటీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 124 జట్లు పాల్గొనగా ఏజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కాలేజీ స్టూడెంట్లు విజేతలుగా నిలిచారు.
మిస్ అండ్ మిస్టర్ డెంటిస్ట్ టైటిల్స్ విన్నర్స్‌గా “లోని” లోని గ్రామీణ దంత కళాశాల విద్యార్థి డాక్టర్ శ్వేతా లొకాండే , రిషికేశ్‌లోని సీమా డెంటల్ కాలేజ్ విద్యార్థి డాక్టర్ శివాన్ష్ మిట్టల్ నిలిచారు. ఛత్తీస్‌గడ్‌లోని రుంగ్‌తా డెంటల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ ముల్పురి తనూజా ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో వైజాగ్ గీతం డెంటల్ కాలేజ్ విద్యార్థి డాక్టర్ వంషిక పాదవాలా, జ్యూరీ అవార్డును శ్రీకాకులం శ్రీసాయి డెంటల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ సాయి కిరణ్ , ప్రత్యేక నైపుణ్యం విభాగంలో హైదరాబాద్ కు చెందిన శ్రీ బాలాజీ డెంటల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ సాయి అఖిల్ విజేతలుగా నిలిచారు.
ఈ సందర్భంగా “బిజ్బోల్” యాప్ వ్యవస్థాపకుడు డాక్టర్ విద్యుత్ స్వర్గం మాట్లాడుతూ, డెంటల్ విద్యనభ్యసించే విద్యార్థులకు వారి యొక్క సత్తాను నిరూపించుకోవడానికి దేశంలోనే ఉత్తమైమైన ఒకేఒక వేదిక “బిజ్బోల్“యాప్ అని పేర్కొన్నారు. ఇది డెంటల్ విద్యను అభ్యసించే విద్యార్థులకు నేర్చుకోవడానికి, డాక్టర్లతో దంతసమస్యలపై చర్చించడానికి, వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అపూర్వమైన వేదిక అన్నారు. విద్యార్థులందరూ ఈ బిజ్బోల్ యాప్ ద్వారా వారి నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సూచనలు సలహాలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ క్విజ్ పోటీల్లో విజేతలైన డెంటల్ స్టూడెంట్లకు దేశంలోని ఉత్తమమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం వస్తుందన్నారు.