ఫేస్‌మేకర్ సర్జరీ చేనుకున్న వృద్ధుడికి కిమ్స్ సవీరలో 2 ఆపరేషన్లు
ఫేస్‌మేకర్ సర్జరీ చేనుకున్న వృద్ధుడికి 2 ఆపరేషన్లు
విరిగిన కాలు, తుంటి ఎముకలను అతికించిన కిమ్స్ సవీరా వైద్యులు
గుండె ఫేస్‌మేకర్ సర్జరీ జరిగిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో కుడికాలు, తుంటి ఎముక రెండు చోట్ల విరిగిపోయాయి. దాంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి కిమ్స్ సవీరా డాక్టర్లు 2సార్లు అరుదైన సర్జరీలు విజయవంతం చేసి ఊపిరిపోశారు. ఆస్పత్రి ప్రముఖ ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ టి. రామాంజనేయులు ఈ సందర్భంగా ఆపరేషన్ జరిగిన పరిస్థితులను వివరించారు. * అనంతపురం జిల్లా, మారాల మండలం, మాదలంకపల్లి గ్రామానికి చెందిన జి.లక్ష్మన్న (75) వృద్ధుడికి ప్రమాదంలో ఓ కాలు విరిగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వెంటనే వివిధ రకాల పరీక్షలు చేసి కాలుతో పాటు తుంటి ఎముక కూడా విరిగిపోయినట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వృద్ధుడు లక్ష్మన్న ఫేస్‌మేకర్ అమర్చిన పేషెంట్ కావడంతో అకస్మాత్తుగా ఆపరేషన్లకు స్పందించని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే ఒక వేళ అదేవిధంగా ఆపరేషన్ చేస్తే వృద్ధుడు కావడంతో పాటు అంతకు ముందేఫేస్‌మేకర్ సర్జరీ పేషెంట్ కావడం వల్ల ఆపరేషన్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గమనించాం.
అయితే కాలుకు సర్జరీలు చేయాలంటే మరోసారి ఫేస్‌మేకర్ సర్జరీ చేస్తే తప్పా .. వృద్ధుడు రెండు ఆపరేషన్లకు సహకరిస్తే విరిగిన కాలు, తుంటి ఎముకలకు ఆపరేషన్ చేయగలమని గుర్తించాం. పెద్ద వయస్సుకు తోడు ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా గుండె పనితీరు, సర్జరీకి సహకరించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు వృద్ధుడిని పరిశీలనలో ఉంచాం. క్రమంగా కోలుకోవడంతో మరో సారి ఫేస్‌మేకర్ సర్జరీ చేయాలని నిర్ణయించి విజయవంతంగా పూర్తి చేశాం. అనంతరం లక్ష్మన్న పూర్తిగా ఆపరేషన్లకు సిద్ధమైన తర్వాత విరిగిన కుడికాలు తుంటికి, కాలుకు రెండు చోట్ల ఆపరేషన్లు చేశాం. సరైన సమయంలో ఆపరేషన్ చేశాం కాబట్టి వృద్ధుడి ప్రాణాలు నిలిచాయి. అయితే 75 ఏళ్లకు పైబడిని వృద్ధుడికి ఇటువంటి ఆపరేషన్ చేయడమనేది చాలా అరుదైన విషయం. కానీ సరైన ప్రణాళికలతో్ ఆపరేషన్లు చేసి వృద్దుడిని ప్రాణాలతో కాపాడాం* అని డాక్టర్ టి. రామాంజనేయులు వివరించారు. ప్రస్తుతం లక్ష్మన్న వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్ తెలిపారు. క్రమంగా తన పనులు తాను చేసుకోగలుగుతున్నట్లు వివరించారు. అనంతరం వృద్ధుడు లక్ష్మన్న ఆయన కుటుంబ సభ్యులు కిమ్స్ సవీరా ఆస్పత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.