వెన్నెముక వైకల్యం నుంచి 15 సంవత్సరాల బాలుడికి విముక్తి
కిమ్స్ వైద్యుల ఘనతవెన్నెముక వైకల్యంతో బాధపడుతున్న ఓ పదిహేను సంవత్సరాల అబ్బాయికి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విముక్తి ప్రసాదించారు. సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అబ్బాయి వెన్నెముకను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. వెన్నెముక అసహజంగా పెరిగిపోవడమే కాక ఛాతీ భాగం వరకు దాని ప్రభావం పడటంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిన తమ బిడ్డకు కిమ్స్ డాక్టర్లు మళ్లీ ప్రాణం పోశారని తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు ప్రకటించారు.
హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన 15 సంవత్సరాల అబ్బాయికి పుట్టుకతోనే వెన్నెముక వైకల్యం ఉంది. గత కొంత కాలంగా అతనికి వెన్ను నొప్పి (బ్యాక్ పెయిన్) వస్తుండడంతో తల్లిదండ్రులు చాలా మంది వైద్యులకు చూపించారు. బాలుడికి ఉన్న వెన్నెముక వైకల్యం వేగంగా పెరిగి అతని ఆకారంలో తేడా వస్తోందని, దాంతోపాటే వెన్నునొప్పి కూడా వస్తుందని డాక్టర్లు గుర్తించారు. కానీ దానికి ఎలాంటి ఉపశమనం చూపించలేకపోయారు. అంతేకాక వెన్నెముక వైకల్య ప్రభావం ఛాతి భాగం వరకు పాకి ఊపిరి పీల్చుకోవడం కూడా అతనికి కష్టంగా మారుతుండడంతో తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అతని ఆయుష్షు కూడా తగ్గిపోతుందేమో అని కూడా ఆందోళన చెంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ ను సంప్రదించారు. వెన్నెముక వైకల్యాల్ని సరిద్దిదడంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ సురేష్ చీకట్ల ఆ బాలుణ్ని పరీక్షించారు. ఎక్స్‌రేలు,హోల్ స్పైన్ సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేసి ఈ వైకల్యాన్ని ర్యాపిడ్‌లీ ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ ప్రైమరీ ఇడియోపాతిక్ డోర్సల్ కైఫోస్కోలియాసిస్ అని అంటారని చెప్పారు. అనంతరం కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ సలహాలు తీసుకుని శస్త్రచికిత్స చేసారు. ఆర్థిక పరిస్థితిని గుర్తించి వైద్యం చేశారు
బాలుడి వయసు 15 సంవత్సరాలు కావడంతో ఎదుగుదల వేగంగా ఉంటుందని, అంతేకాక వాళ్ళ కుటుంబ ఆర్ధిక పరిస్థితి పెద్దగా బాగుండని నేపథ్యంలో సింగిల్ స్టేజి డిఫార్మిటీ కరెక్షన్ శస్త్రచికిత్స చేశామని కిమ్స్ ఆసుపత్రి చెప్పింది. దీని వల్ల తక్కువ ఖర్చుతోనే వైకల్యాన్ని సరిచేయడానికి అవకాశం ఏర్పడింది. సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను స్పైన్ సర్జన్లు డాక్టర్ సురేష్ చీకట్ల, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ రోహిత్ కిలారు కలిసి డాక్టర్ నరేష్ కుమార్ నేతృత్వంలోని అనస్తీషియా బృందం సహకారంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి వెన్నెముక దాదాపు సాధారణస్థితికి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. తమ బిడ్డ వైకల్యాన్ని సరిచేసినన వైద్యులకు ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వెన్నెముకకు సంబంధించిన ఇలాంటి వైకల్యాలను చిన్న వయసులో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వైకల్యాన్ని దాదాపు సరిదిద్దవచ్చని, వాళ్ళు పెద్దయ్యే కొద్దీ చికిత్స క్లిష్టంగా మారుతుందని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: గిరి @9963445785