ఫోలిక్ ఆమ్లంతో చురుకైన ఆరోగ్యం

  • ఫోలిక్ ఆమ్లం అవగాహాన వారం – జనవరి 4 నుండి 10 వరకు

లావ‌ణ్య‌,
కన్సల్టెంట్ డైటీషియన్
కిమ్స్ ఐకాన్‌, వైజాగ్‌.

ఫోలిక్ ఆమ్లం అనేది బి-కాంప్లెక్స్ విటమిన్ల సమూహానికి చెందినది. ఇది శరీరంలో దాని అంతట అదే తయారుకాదు. ఫోలేట్ రిచ్ ఆహార పదార్థాలను తినడం ద్వారా పొందవచ్చు. ఇది నిరంతరం మన శరీరంలో కొత్త కొత్త కణాలను ఉత్పత్తి చేయుటకు సహాయం చేస్తుంది. ఊదహారణకు చర్మం, వెంట్రుకలు, గోర్లు, స్త్రీలలో నెల సరులు, గర్భధారణ, ప్రసవం, పిల్లలకు పాలు ఇవ్వడానికి ఫోలిక్ ఆమ్లం అత్యవసరం.

ఎర్ర రక్తకణాల తయారీకి ఫోలిక్ ఆమ్లం అవసరం. ఇది సరైన మొతాదులో శరీరానికి అందకపోతే మోగాలో బ్లాస్టిక్ ఎనీమియాకి దారి తీస్తుంది. దీనిని మాత్రల రూపంలోమరియు ఆహారం ద్వారా కలిపి తీసుకుంటేనే శరీరం బాగా గ్రహిస్తుంది (డాక్టర్ల సూచనల మేరకు). అలాగే వెంట్రుకలు రాలకుండా కూడా ఫోలిక్ ఆమ్లం సహాయం చేస్తుంది.

ఏఏ దశలలో ఎంత అవసరం (ఫోలిక్ ఆమ్లం)

  • ప్రతి మనిషికి ప్రతి రోజు 400 ఎంసీజీ ఫోలిక్ ఆమ్లం అవసరం.
  • గర్భధారణ ఆలోచన వచ్చింది మొదలు ఫోలిక్ ఆమ్లంని ఆహార రూపంలో మరియు మాత్రల రూపంలో ప్రతి రోజు 500 ఎంసీజీ తీసుకోవలెను.
  • గర్భస్థ పిండానికి తొలి నాలుగు నెలలు చాలా కీలకం

ఎ) ఆ సమయంలో ఫోలిక్ ఆమ్లం యొక్క లోపం వలన కలిగే అనర్థాలు.

  1. న్యూరోలాజికల్ (పుట్టుకతో వచ్చే అవకతవకలు) ఇబ్బందులు
  • వెన్నుముక సరిగ్గా పూడక రంధ్రాలు ఉండడం.
  • మెదడు సరిగ్గా ఎదగక ఆటిజం సమస్య వస్తుంది.
  • గుండెకు సంబంధించిన సమస్యలు
  • గ్రహణ మొర్రి
  • గర్భస్థ శిశువు సరైన బరువు లేకపోవడం
  1. వంశ పారంపర్యంగా వచ్చే న్యూరోలాజికల్ సమస్యలు కలిగిన వారు (ఆర్ఎన్ఏ, డీఎన్ఏ) 4000 ఎంసీజీ ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి.
  2. ప్రౌడ అమ్మాయిలు ప్రతి రోజు 400 ఎంసీజీ ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి (నెల సరులు ఆరంభం అవుతాయి గనుక). కాబట్టి ఫోలిక్ ఆమ్లం గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, పాలి ఇచ్చే సమయంలో చాలా కీలకం.
  3. 35 నుండి 45 సంవత్సరాల వయసులో ఈ లోపం తలెత్తితే… ఎముకలు గుల్లబారటం, గుండె జబ్బులు, జట్టు రాలుట వంటివి సంభవిస్తాయి.
  4. పెద్ద వయసులో వారికి వచ్చే సమస్యలు.
  • మతి మరుపు, తలనొప్పి, పార్కిన్సన్స్ వ్యాధి.
  • చూపు మందగించడం, రెండుగా కనపడటం.
  • ఆల్జిమర్స్.
  • డిప్రెషన్ ( డిప్రెషన్ మందులు ప్రభావవంతంగా పని చేయాలంటే ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్స్ కూడా వీటితో పాటు తీసుకోవాలి).
  1. మహిళలను వేధించే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
  2. పెద్దవారికి గుండె సమస్యలు రాకుండా ఉండటానికి డాక్టర్లు ఫోలిక్ ఆమ్లం మాత్రలను సూచిస్తారు.
  3. తాజా కూర‌గాయ‌లు, చేపలు, తృణ ధాన్యాలు, రొయ్యలు

అధిక మోతాదులో తీసుకుంటే వచ్చే సమస్యలు

ప్రతి రోజు 400 ఎంసీజీ ఫోలిక్ ఆమ్లం తీసుకుంటే చాలు. అంతకు మించి తీసుకోవడం వల్ల వికారం, నీరసం, నిద్రలేమి సమస్యలు, చికాకుతో పాటు ఇతర సమస్యలు రావచ్చు.