మెదక్ ప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ చందనదీప్తి

ప్రజలకు నమ్మకాని చూరుగోనెల విధినిర్వహణ చేయండి

  • – కరోనా సమయంలో ప్రజా క్షేమం లక్ష్యంగా పని చేసిన పోలీస్ శాఖ
  • – ప్రజల హక్కులు కాపాడడం లక్ధ్యంగా పని చేయాలి
  • – పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం లభిస్తుందన్న భరోసా కల్పించాలి
    —-: జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్.పి. గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ... క్షిష్టమైన సంవత్సరం దాటుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని నూతన సంవత్సరంలో జిల్లాలోని పోలీసులంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, దానికి తోడు కొత్త వైరస్ లు వస్తున్నాయని ఇలాంటి క్రమంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కరోనా కష్టకాలంలో, లాక్ డౌన్ సమయంలో తమకు కరోనా సోకినా ప్రజల క్షేమం ముఖ్యమని భావించి పోలీస్ అధికారులు, సిబ్బంది చేసిన కృషి, సేవలను గుర్తు చేస్తూ సిబ్బందిని అభినందించారు. పరస్పర సమన్వయంతో, కలిసి పని చేయడం ద్వారా పోలీస్ శాఖలో అన్ని స్థాయిల అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకంగా పని చేశారని అన్నారు. ఈ నూతన సంవత్సరంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను మెప్పించేలా, వారి అభిమానం, నమ్మకాని చూరుగోనెల, మరియు మన్ననలు పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా పోలీస్ అధికారులు పని చేయాలని తద్వారా పోలీస్ శాఖ గౌరవం పెంచేలా ముందుకు సాగాలని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు అన్నారు. ప్రజల దృష్టిలో పోలీసులంటే న్యాయం చేసే వారని, పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలలో కల్పించడం లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారి హక్కులను కాపాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అదే సమయంలో చట్టాలను గౌరవించే ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. శ్రీ పి. కృష్ణ మూర్తి గారు , తూప్రాన్ డి.ఎస్.పి. శ్రీ. కిరణ్ కుమార్ గారు , మెదక్ టౌన్ సి.ఐ. వెంకట్ గారు, మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ ల సి.ఐ. లు , ఎస్.ఐ. లు, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. చందర్ రాథోడ్, ఎస్.బి.ఎస్.ఐ. సందీప్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.