భారత్‌లో 29 స్ట్రైయిన్ కరోనా కేసులు
ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాము అనుకుంటున్న సమయంలో మరో పెద్ద పిడుగు వచ్చి పడింది. కరోనాతోనే ప్రజలు ఇబ్బంది పడుతుంటే…. కొత్తగా వచ్చిన స్ట్రైయిన్ కరోన మరింత భయపెడుతోంది. ఇప్పటికే కోట్లమందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చి లక్షల మంది మరణించారు. అయితే ఇప్పుడు కొత్తగా బ్రిటన్‌లో వెలుగు చూసిన స్ట్రైయిన్ కరోనా… చైన కరోనా కంటే వేగంగా విస్తరిస్తుందని… దీనితో చాలా ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుఫులు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో బ్రిటన్ నుండి దాదాపు 30 వేల మందికి పైగా భారత్‌కు చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 10 ల్యాబ్‌లకు గాను ఆరు ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షలకు 29 మందికి స్ట్రైయిన్ కరోనా వచ్చినట్లు గుర్తించామని వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వైరస్ మరింత విస్తరించకుండా అధికారులు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అధికారులకు సహాకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు.