పగిలిన గుండె రక్తనాళానికి కిమ్స్ కర్నూలులో అరుదైన చికిత్స
- ప్రపంచంలో 20వ కేసు
- యువకుడికి ప్రాణాలు కాపాడిన డాక్టర్ చింతా రాజ్‌కుమార్
డెక్కన్ న్యూస్ : ప్రపంచంలోనే అత్యంత అరుదైన 20వ చిక్సితను కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలులో విజయవంతంగా పూర్తి చేశారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన నాగార్జున రెడ్డి (32) ఏళ్ల యువకుడు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరీక్షీంచిన వైద్యలు ఈసీజీలో ఎటువంటి గుండె పోటు లక్షణాలు లేవని తేల్చారు. అయితే రక్త పరీక్షలు చేయగా గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అక్కడి వైద్యులు పేర్కొనడంతో అర్థరాత్రి కిమ్స హాస్పిటల్స్ కర్నూలుకు తీసుకువచ్చారు.
ఈ కేసు గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.హెచ్.రాజ్‌కుమార్ మాట్లాడుతూ సాధారణంగా గుండెపోటు రావడానికి రక్తనాళాలు మూసుకపోవడం వల్ల జరుగుతుంది. ఈ కేసులో మాత్రం గుండెపోటు రక్తనాళం పగడలడం వల్ల వచ్చిందని… యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళం పగిలిందని నిర్ధారణ చేశామన్నారు. ప్రపంచంలో ఇది 20వ కేసుగా పరిగణించవచ్చన్నారు. ఈ కేసు మిగిత 19 కేసులకంటే భిన్నమైనదన్నారు. రక్తనాళం పగిలి రక్తం కారుతూ గుండె చుట్టూ చేరుకొని ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ సమయంలో రోగి బిపి తగ్గి వెంటనే మరణించే ప్రమాదం ఉంది. అయితే ఈ రోగిలో త్వరలో ఆ ప్రమాదాన్ని గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్త ప్రవాహాన్ని ఆడ్డుకున్నామని తెలిపారు.
అయితే కర్నూలు ప్రాంతంలో ఇలాంటి చికిత్సకు సంబంధించిన అత్యధునిక పరికరాలు అన్ని ల్యాబ్‌లలో లభించవని, ఒక్క కిమ్స్ హాస్పిటల్ ఉన్నాయని తెలిపారు. వెంటనే కవర్డ్ స్టంట్ వేసి యువకుడి ప్రాణాలు కాపాడామని పేర్కొన్నారు. ఆ తరువాత కార్డియాక్ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తరువాత ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించామన్నారు.
పదిహేను రోజుల తర్వాత రోగిని తిరిగి పరీక్షించినప్పుడు పూర్తిగా కోలుకోని ఆరోగ్యగంగా ఉన్నారని దృవికరించామని తెలిపారు. అనంతరం రోగి మాట్లాడుతూ తన ప్రాణాలన కాపాడినందుకు డాక్టర్ రాజ్‌కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా భవిష్యత్తులో ఇతని గుండెపోటు రావడం అరుదుగా జరగవచ్చని డాక్టర్ అన్నారు . అయితే ధూమాపానం, మద్యం సేవించడం చేయరాదని, నిత్యం వ్యాయామం చేయాలని, బిపి, షుగర్‌లను కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి వ్యాధులు కుటుంబంలో రక్త సంబంధికులకు వచ్చే అవకాశం ఉన్నందున వారు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు.