ఒకే కుటుబంలో 22 మందికి క‌రోనా

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌ళ్లీ దార‌లంగా విస్త‌రిస్తుంది. సూర్య‌పేట‌లో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి క‌రోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అక్క‌డ క‌ల‌క‌లం రేగుతోంది. ఇటీవ‌ల వారంతా ఓ అంత్య‌క్రియలకు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. దీంతో వారు ఎవ‌రెవ‌రిని క‌లిశారు అని అంశాల‌ను ఆరా తీస్తున్నారు వైద్య శాఖ అధికారులు. అయితే క‌రోనా మొదట‌గా విస్త‌రిస్తున్న ఏప్రిల్ మాసంలో కూడా సూర్య‌పేట జిల్లాలో పెద్ద ఎత్తున్న కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిన‌దే.