కమలం గూటికి 30 మంది తెరాస ఎమ్మెల్యేలు
నూతన సంవత్సరం మొదటి రోజే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని రాజ్‌భవన్ సాక్షిత వ్యాఖ్యానించారు. రాజ్యంగ విరుద్ధంగా నడుచుకొవద్దని ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. లేదంటే వారు ఎప్పుడో తమ పార్టీలోకి జంప్ చేసేవారని అన్నారు.
ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో తెరాస వ్యతిరేకంగా భాజపా గెలవడం అలవాటైంది. దుబ్బాక ఎన్నికలు మొదలుకొని గ్రేటర్ ఫైట్ వరకు కమలం వికసిస్తునే ఉంది. త్వరలో నాగార్జున సాగర్ నియోజకవర్గనాకి జరిగే ఉప ఎన్నికల్లో కూడా భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో తెరాస గడ్డు పరిస్థితులు వచ్చాయనే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కూడా భాజపాకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నా.. తీరు కూడా ప్రత్యక్ష కనిపిస్తోంది. గతంలో కేంద్రాన్ని విమర్శించిన అతను … గత కొన్ని రోజులుగా భాజాపాకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతలు ఇతర పార్టీలకు మారకుండా చూసుకుంటున్నా… బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీలతో ముసలం మొదలైంది. ఎవరా ముప్పై మంది అని ఆరా తీస్తున్నారు.