మంత్రి కానున్న ఎమ్మెల్యే రజిని
ఏపీలోని రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ విస్తరణలో ఖచ్చితంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని మంత్రి అవుతారని స్థానిక నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలు మాట్లాడుకుంటూ… వైకాపాలోనే రాజకీయంగా స్త్రీలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని అంటున్నారు. అలాగే ఈ సారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో తమ ఎమ్మెల్యేకి మంత్రి పదవి వరించడం ఖాయమంటున్నారు.
కరోనా కాలంలో విసృతంగా సేవ
కరోనా వల్ల విధించిన లౌక్‌డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. చేద్దామన్న ఏ పని లేని కనీసం తినడానికి తిండి లేని సమయంలో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజని తమ సొంత ఖర్చులతో… ఊరురా తిరుగుతూ… ప్రతి ఒక్కరికి సాయం చేశారు. కరోనా వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరిని పెద్దక్కలాగా అక్కున చేర్చుకొని బాసటగా నిలిచారు. ఇలా చెప్పుకుంటూ… పోతే ఆమె చేసిన సేవలు అనేకం. ఇలా అన్ని విషయాలను గమనిస్తున్న అధిష్టానం మంత్రి పదవి ఖచ్చితంగా ఆమెకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.