మ‌హిళ అండాశ‌యం నుండి 10.2 కిలోల కణితి తొలగింపు

◆ మీగ్స్ సిండ్రోమ్ కారణంగా గడ్డ ఏర్పడినట్లు నిర్ధారణ
◆ మహిళను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏవోఐ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి

క్యాన్సర్ వ్యాధికి అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలందిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్రకుమార్ అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని నిర్వహించి మహిళ అండాశయంలో ఏర్పడిన భారీ గడ్డను విజయవంతంగా తొలగించారు. పెడకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన 47 ఏళ్ల మహిళ గడచిన నాలుగు నెలలుగా విపరీతమైన కడుపు ఉబ్బరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొట్ట అసాధారణంగా పెరిగిపోవడం తదితర లక్షణాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు చేరారు. డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి నేతృత్వంలోని అమెరికన్ ఆంకాలజీ వైద్య నిపుణులు అవసరమైన పరీక్షలు నిర్వహించి, మహిళ యొక్క ఎడమ అండాశయంలో గడ్డ ఏర్పడినట్లు గుర్తించారు. అండాశయంలో గడ్డ అసాధారణరీతిలో పెరిగిపోవడంతో పాటు, ఉదరభాగంలో, ఊపితిత్తుల్లోనూ నీరు చేరింది. దీంతో రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వైద్యులు గుర్తించారు. రోగికి హిస్టరెక్టమీ ఆపరేషన్ నిర్వహించి, ఆమె అండాశయంలో ఏర్పడిన 10.2 కిలోల భారీ గడ్డను తొలగించారు. మీగ్స్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా మహిళ అండాశయంలో గడ్డ ఏర్పడినట్లు గుర్తించామని, క్యాన్సర్ తరహా లక్షణాలున్నప్పటికీ ఏవోఐలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మీగ్స్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లుగా నిర్ధారించగలిగామని డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి తెలిపారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న పేషేంట్ ఈ సమావేశంలో మాట్లాడుతూ తనకు పునర్జీవితం ప్రసాదించిన ఏవోఐ వైద్య నిపుణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యబృందం డా. ఫణింద్ర కుమార్ నాగిశెట్టి, డా. నాగేశ్వర రావు కుక్కడల, డా.ధన్ రాజు కే ఎం, డా.అప్పల సత్య శ్రీనివాస్, డా. సుధాకర్ కోట్లపాటి, డా.యశ్వంత్ పమిడి, డా.జితేంద్ర కుమార్ కంచెర్ల, డా.అమృత గుగులోత్ మరియు ఏఓఐ సెంటర్ హెడ్ హేమ కుమార్, డా.సుదర్శన్ బాబు నందా మరియు ఆంధ్రప్రదేశ్ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర రెడ్డి పాల్గొన్నారు.