తూప్రాన్ వద్ద హల్దీ గోల్ఫ్ కౌంటీ
డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ మరియు గిరిధారీ హోమ్స్ యొక్క ఉమ్మడి వెంచర్ ఇది. తెలంగాణాలో అత్యాధునిక గోల్ఫ్ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారు
రెసిడెన్షియల్ యూనిట్లతో 18 హోల్స్ చాంఫియన్‌షిప్ గోల్ఫ్ కోర్స్‌ను మిళితం చేసిన సంపూర్ణమైన గోల్ఫ్ కోర్స్– హల్దీ గోల్ఫ్ కౌంటీ ఇప్పుడు ప్రారంభమైంది. డ్రీమ్ వ్యాలీ గ్రూప్ మరియు గిరిధారీ హోమ్స్ ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రమోట్ చేయనున్నాయి. ప్రపంచశ్రేణి గోల్ఫింగ్ సదుపాయాలను ఈ ప్రాజెక్టు అందించడంతో పాటుగా వినియోగదారుల కోసం ప్రీమియం, ఉన్నత శ్రేణి గృహ వసతి సదుపాయాలనూ అందించనుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ పసిఫిక్ కోస్ట్ డిజైన్ ఈ హల్దీ గోల్ఫ్ కౌంటీకి డిజైన్ చేసింది. అంతర్జాతీయంగా గోల్ఫ్ కోర్సులను డిజైన్ చేసిన అపార అనుభవం కలిగిన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్ ఫిల్ ర్యాన్ మరియు పౌల్ రీవ్స్ దీనికి రూపకల్పన చేశారు.
శ్రీ ఇంద్రసేనా రెడ్డి, ఫౌండర్ &మేనేజింగ్ డైరెక్టర్ – గిరిధారీ హోమ్స్ మాట్లాడుతూ ‘‘డ్రీమ్‌వ్యాలీ గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మరియు హల్దీ గోల్ఫ్ కౌంటీని ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ప్రజల కలలను సాకారం చేయడంతో పాటుగా వారి కోరికలను తీర్చాలనే లక్ష్యంతో కమ్యూనిటీలను మేము సృష్టిస్తున్నాం. హల్దీ గోల్ఫ్ కౌంటీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. నదీతీరంలో ఉన్నటువంటి ఈ గోల్ఫ్‌కౌంటీ, ప్రీమియం జీవనశైలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకునే వారికి అనువైన ప్రాజెక్ట్. ప్రపంచశ్రేణి గోల్ఫ్ గేటెడ్ కమ్యూనిటీని మేము నిర్మిస్తున్నాం. ఇది అత్యుత్తమ శ్రేణి మౌలికసదుపాయాలు మరియు వసతులను అందించడం ద్వారా విలాసాన్ని పునర్నిర్వచించనుంది’’ అని అన్నారు.
హైదరాబాద్ నగరానికి ఒక గంట ప్రయాణం దూరంలో ఉన్నటువంటి తూప్రాన్ వద్ద హల్దీ గోల్ఫ్ కౌంటీ ఉంది. వ్యూహాత్మకంగా భాగస్వామ్యం చేసుకున్న డ్రీమ్‌వ్యాలీ గ్రూప్‌కు తెలంగాణాలో రిసార్టులను సృష్టించిన ఘనత ఉంటే, గిరిధారీ హోమ్స్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక మరియు విలాసవంతమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్‌కు గోల్ఫ్ కోర్సులను అభివృద్ధి చేసిన అపార అనుభవం ఉంది. ప్రస్తుతం దీనికి రెండు గోల్ఫ్ కోర్సులు అడ్వాన్స్ దశలో ఉండగా మరో రెండు అభివృద్ధి దశలో ఉన్నాయి.
శ్రీ పృథ్వీ రెడ్డి, సీఈవో, హల్దీ గోల్ఫ్ కౌంటీ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. ఎంఎన్‌సీలకు ఇది అతి పెద్ద వ్యాపార కేంద్రంగా మారుతుంది. దీనితో పాటుగా స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. హల్దీ గోల్ఫ్ కౌంటీ అనేది విలాసవంతమైన, ఆహ్లాదకరమైన ఆకుపచ్చని ప్రాంగణాలకు కొనసాగింపు. దీనిలో గోల్ఫ్ క్లబ్, హౌసింగ్ యూనిట్లు, 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ మరియు క్లబ్ హౌస్ ఉన్నాయి. భవిష్యత్‌లో వృద్ధిని ఆశించేవారికి సైతం ఇది అనుకూలమైన ప్రాజెక్ట్‌గా నిలువడమే కాదు,మీరు గోల్ఫ్ ఆడుతూనే దీనిని వినూత్నంగానూ నిలుపవచ్చు. భారతదేశంలో అత్యుత్తమ గోల్ఫ్ కేంద్రంగా హల్దీ నిలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాము. అంతేకాదు, గోల్ఫ్ ప్రేమికులు, వారి కుటుంబసభ్యులకు సైతం ఇది ఖచ్చితమైన గోల్ఫ్ కోర్సుగా నిలువనుంది. ఓ నదీ తీరంలో ఉన్న ఒకే ఒక్క గోల్ఫ్ కోర్సుగా ఇది నిలువడంతో పాటుగా అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతానికి మరింత అందం జోడిస్తుంది. అంతర్జాతీయంగా గోల్ఫర్లకు ఉత్సాహపూరితమైన సదుపాయాలను అందిస్తుందని వాగ్ధానం చేస్తున్నాము’’ అని అన్నారు.
హల్దీ నదీ తీరంలో ఉండటం వల్ల హల్దీ గోల్ఫ్ కౌంటీగా దీనికి నామకరణం చేశారు. అత్యంత విలాసవంతమైన ఈ వెంచర్ , హైదరాబాద్ నగరపు భావి పర్యాటక ప్రాంతంగా విలాసవంతమైన మరియు పర్యావరణ పరంగా మహోన్నతమైన ప్రాంతాల ద్వారా నిలువనుంది. నగరపు రద్దీ వాతావరణానికి దూరంగా ఉండే ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి ఖచ్చితమైన వీకెండ్ గేట్‌వేగా అద్భుతమైన సౌందర్యం మరియు ఆకట్టుకునే అమరికలతో నిలుస్తుంది. ఈ నివాస ప్రాంతం అద్భుతమైన గోల్ఫ్ వీక్షణతో ఆహ్లాదకరమైన అనుభవాలనూ తీసుకువస్తుంది.
హల్దీ గోల్ఫ్ కౌంటీ ఇప్పుడు నదీ తీరంలో గోల్ఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల పరంగా దేశంలో నూతన ప్రమాణాలను ఏర్పరచడానికి సిద్ధమైంది. చుట్టు పక్కల ప్రాంతాలు మరియు దాని ఆకట్టుకునే అందాల స్ఫూర్తితో రూపొందించబడిన హల్దీ గోల్ఫ్ కౌంటీ వద్ద వినోదాత్మక గోల్ఫ్ కోర్సులతో పాటుగా అత్యద్భుతమైన నీటి చెలమలు మరియు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆకుపచ్చని పరిసరాలు, అందమైన హల్దీ నదీ ఈ గోల్ఫ్ కోర్సు వెంబడి ఉంటాయి. మొదటి దశలో 250 ప్లాట్స్‌ను కవర్ చేస్తారు. అత్యద్భుతమైన చాంఫియన్‌షిప్ గోల్ఫ్ కోర్సులో ఉండే సదుపాయాలన్నీ ఉండటంతో పాటుగా కాలుష్య రహిత వాతావరణం, అత్యంత అందమైన ప్రకృతితో ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.
వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిలో క్లబ్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. దీనిలో స్విమ్మింగ్ ఫూల్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, లాంజ్, బోర్డ్ రూమ్స్, జిమ్, ఇండోర్ గేమ్స్ మరియు మరెన్నో ఉన్నాయి.