పసివాడి వైద్యానికి విరాళంతో సహకరించిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”
గుండె మరియు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4నెలల పసివాడి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”. ఒక్కరోజులోనే 50 వేల విరాళాన్ని సేకరించి పసివాడి తల్లిదండ్రులకు అందించి తమ సేవ స్ప్రతిని చాటిన సంస్థ ప్రతినిధులు.
దేవరకొండ పట్టణానికి చెందిన దంపతుల 4 నెలల బాబు గత కొంత కాలంగా గుండె మరియు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన బాబు తండ్రి బాబు వైద్యానికి అప్పటికే లక్ష యాభై వేలు వెచ్చించినప్పటికీ బాబు పరిస్థితి మెరుగుపడలేదు. మెరుగైన వైద్యం కోసం బాబును కొత్తపేట లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ చేర్పించారు. బాబు వైద్యానికై రోజుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ తరుణంలో హాస్పిటల్ బిల్ కట్టలేక ఆర్థిక సహాయం కోరిన తండ్రికి హాస్పిటల్ బిల్ చేయడానికి “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్” వ్యవస్థాపకులు సునీల్ దూట ముందుకు వచ్చారు.
వాట్సాప్ ఆధారితంగా కొనసాగే ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సునీల్ దూట విరాళాల సేకరణకై సంస్థల్లోని సభ్యులకు సమాచారం అందించిన కొన్ని గంటల వ్యవధిలోనే 50 వేల రూపాయల విరాళాలు సేకరించడం జరిగింది. ఆ విరాళాన్ని “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్” వ్యవస్థాపకులు సునీల్ దూట మరియు సంస్థ సభ్యులు బాబు తల్లితండ్రిని కలిసి అందించడం జరిగింది.