సంక్రాంతి త‌రువాత తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

క‌రోనా వ‌ల్ల మూతప‌డ్డ‌వి ఒక్కొక్క‌టి తెరుచుకుంటున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలకు లోబ‌డి అనేక సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అయితే పిల్ల‌ల ఆరోగ్యాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్ప‌టివ‌ర‌కు పాఠ‌శాల‌లు, కాలేజీలు ఓపెన్ చేయ‌లేదు. కాగా కొత్త ఏడాదిలో ఇవి కూడా తెర‌చుకోనున్నాయి.
సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్​ ఎగ్జామ్స్​నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి, స్టూడెంట్స్​ను ఎగ్జామ్స్​కు​ రెడీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్​ సీఎం కేసీఆర్​ వద్దకు చేరాయి. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్​ చేస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్​ కోర్సులకు క్లాసులను మొదలుపెట్టనున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్​ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.‌