హీరో 50 ప్లస్, హీరోయిన్ 19 ఏంటా రోమాన్స్ ?
సినీ రంగం అంటేనే సంచలనాలకు అడ్డాగా మారింది. ఇటీవల బాలీవుడ్ నటి దియా మీర్జా పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ… ఆరోపణలు గుప్పించింది. సినీ ఇండస్ట్రీలో పురుషాధిపత్యం కొనసాగుతోందని మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 50 ప్లస్ ఏజ్ ఉన్న వ్యక్తి 19 ఏళ్ల వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిల్మ్ మేకర్స్ కూడా 50 ప్లస్ ఉన్న పురుషుల కోసం స్క్రిప్ట్స్ డిజైన్ చేస్తున్నారు కానీ, మహిళల కోసం మాత్రం అలాంటి పాత్రలు రాయడం లేదన్నారు. నీనా గుప్తా లాంటి నటీమణులు తమ కోసం క్యారెక్టర్స్ తయారు చేయాలని ఓపెన్‌గా చెప్పారు. నేను నటిని.. నాకు ఈ జాబ్ పట్ల ప్రేమ ఉంది.. నన్ను కాస్ట్ చేయండి అని చెప్పగలిగారు. దీంతో కొందరు మేకర్స్ తనకు అవకాశాలు ఇచ్చారు. కానీ ఇంకా చాలా మంది మిడిల్ ఏజ్డ్ ఫిమేల్ యాక్టర్స్ పనిలేకుండా ఉంటున్నారని.. వాళ్ల కోసం కూడా కథలు రాయాలని కోరారు. ఏదైనా మూస పద్ధతి మంచిది కాదని తెలిపిన దియా మీర్జా.. కెరియర్లో చాలాసార్లు తనను చూసే విధానం తనకు ప్రతికూలంగా ఉందన్నారు. తను చాలా అందంగా కనబడుతున్నందున క్యారెక్టర్స్ కోల్పోయానని.. ఇది ఒక వింత ప్రతికూలత అన్నారు.