సీఎంకి మైక్ ఉన్నప్పుడే మైనార్టీలు గుర్తుకు వస్తారు : కాట్రగడ్డ
భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరి బతికే హక్కు ఉంది. కానీ గత కొన్నిసంవత్సరాలుగా దేశంలో మైనార్టీలను అణిచివేయాడానికి కొందరు కంకణం కట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైన వారు మారాలి మైనార్టీలకు రక్షించాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు గుర్తించబడుతుంది. అంతేకానీ ఓట్ల కోసం మైనార్టీలను వాడుకొని తరువాత వానికి దూరం పెట్టడం సరైన పద్దతి కాదు. రాజ్యంగ బద్దంగా వారికి కూడా హక్కులు కల్పించారు. వారి అభివృద్థి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి, ఆ నిధులన వారికి చేరువయ్యేలా చూడాలి.
మైనార్టీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. వారి ఎదుగుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ నుండి ఇప్పడున్న చంద్రబాబు వరకు మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇటీవల గ్రేటర్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మైనార్టీ వర్గాలకు చెందిన అనేక మందికి ఒక్క తెలుగుదేశం పార్టీనే ఎక్కువ టిక్కెట్లు కేటాయించింది. ఇది మా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. సీఎం కేసీఆర్ మైక్ ఉన్నప్పుడే మైనార్టీల గురించి మాట్లాడుతారు కానీ ఎక్కడ కూడా వారి అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖాలాలు లేవు.
ఇప్పటికైన ప్రభుత్వాలు మారాలి, మైనార్టీల హక్కులను కాపాడాలి.