నేను పక్కా లోకల్ నాకే టీపీసీసీ పదవి ఇవ్వండి : కోమటి రెడ్డి
టీపీసీసీ పదవి రేసులో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే పదవిని ఆశించన వారు హస్తిన చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అంతేకాకుండా పార్టీ హై కమాండ్ కూడా వారిని ఢిల్లీకి పిలిపించి వారి బలాబలాలు తెలుసుకుంటున్నారు. అయితే ఈ పదవిలో కీలకంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డిల పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరిలో పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
కాగా సోనియా, రాహుల్ ముందు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి కొత్త డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పార్టీలోనే ఉన్నా.. నేను పక్క లోకల్ నాకే టీపీసీసీ పదవి ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసిన వారికే పదవి కట్టబెట్టాలని అంటున్నట్లు సమాచారం. ఇటీవల భాజపాలో కూడా బండి సంజయ్‌కి ఇస్తే పార్టీలో వచ్చిన మార్పులను తాను కూడా చేస్తానని తన దగ్గరి వారి దగ్గర చెప్పినట్లు సమాచారాం.
అయితే హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్న వారిలో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరీ.