రైతులెందుకు ఉద్యమం చేస్తున్నారో తెలుసా : అనూష
పచ్చని పల్లెలు వదిలి పట్టణానికి వచ్చి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు?. రైతులపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ ఎంతా… రైతు అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుటుందా ఇలాంటి విషయాలు తెలసుకోవాలంటే అనుష వివరించిన కథనం చదవండి.
కేంద్రం రైతుల మేలుకోసం తెచ్చిన చట్టానికి రైతులే వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇది రైతు క్షేమం కోసం తెచ్చిన చట్టమా లేక కార్పొరెట్స్ కి ఇంకా కోట్ల లాభాలని కూడబెట్టించే కార్పొరెట్స్ చట్టమా?
అంబానీ, అదానీ ఏ కాక అన్ని కార్పొరేట్స్ కళ్ళు ఎప్పటినుంచో భారతదేశపు ఫుడ్ గ్రేన్ మార్కెట్ పై వున్నవి కాకపోతే ఇంతకుముందు దాక వున్న రైతుల బిల్లులో అంబానీ, అదాని, కార్పొరేట్స్ కి కొన్ని అడ్డంకులున్నాయి, ఆ అడ్డంకులని తొలగించి రైతుల కష్టర్జీతాన్ని మొత్తంగా వారికి దోచిపెట్టడానికే కేంద్రం ఇపుడు ఓ కొత్త రైతుల బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే అది పూర్తిగా కార్పొరేట్స్ కి లాభం చేకూర్చి రైతుల నోట్లో మట్టి కొట్టే బిల్లు అని ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీ చేరుకొని మరి నిరసన చేపడితే దానికి మద్దతుగా వివిధ సంఘాలు, విద్యార్థులు, బుద్ధిజీవులు అంత కూడ వారి వారి రాష్ట్రాలలో ఎదో ఒక రూపంలో వారికి మద్దతుగా సంఘీభావాన్ని తెలుపుతున్న కేంద్రం మాత్రం ఇప్పటికి సిగ్గులేకుండ ఇది రైతు క్షేమం కోసమే అని జనాలనింకా వెర్రివాళ్ళని చేయాలనీ చూస్తుంది.
ఇది నిజంగా రైతుకి మేలు చేసే చట్టమే అయితే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులెందుకు నిరసన చెప్పాడుతున్నారు, మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుకి వ్యతిరేకంగా రైతులంత మోడీనీ ఇంతలా నిలదీస్తుంటే ఆయన ఎలాంటి సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వకపోగ ఢిల్లీకి బయల్దేరిన రైతుల ట్రాక్టర్లనీ ఆపడానికి రోడ్లని తోవ్వించాడు, ధర్నా చేస్తున్న ముసలి రైతులపై కనీస కనికరం లేకుండ వారిమీద అంతటి చలిలో వాటర్ కెనాన్స్ నీ విడిపించి, టియ్యర్ గ్యాస్నీ వదిలించాడు, లాఠీ ఛార్జ్ చేయించాడు చివరికి రైతులని దేశద్రుహులుగా చిత్రికరించి వారిమీద బుల్లెట్ల వర్షం కురిపించాడు. వారిని చిత్రహింసల పాలు చేసి ఇప్పటికే నాలుగురు రైతులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే , 11 మందిదాక రైతులు నీరసనలో పాల్గొంటు గుండెపోటు వొచ్చి అక్కడికక్కడే చనిపోడానికి కారణమైయ్యడు.
అసలు మోడీ కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో ఏం వున్నాయి?రైతులెందుకు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, చావడానికి కూడ సిద్దమై ప్రాణాల్ని ఎందుకు కోల్పోతున్నారు, ఇప్పటివరకు వున్న చట్టంలో, ఇపుడు కొత్తగా తెచ్చిన చట్టంలో గల మార్పులేంటి అని కాస్త చూద్దాం.
No. 1)
రైతుల నుండి వస్తువులను కొనాలంటే రాష్ట్రానికి కొన్ని నిబంధనలు ఉంటాయి అయితే వివిధ రకాల రాష్ట్రాలలో వివిధ రకాల నిబంధనలు ట్యాక్స్‌లు అంటే ప్రోడక్షన్ కొనుగోలులో కార్పొరేట్స్ కి కాస్త ఇబ్బంది ఉంది.
కొత్త చట్టం : అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన rules, regulations and tax system ఉంటుంది, అన్ని రాష్ట్రాలకి ఒకటే చట్టం. అంతట ఒకేలా కనుగొలు చేసుకోవొచ్చు ఇది కార్పొరేట్స్ కి చాలా easy అవుతుంది .
No. 2) కార్పొరేట్స్ కొన్న production నీ వారు నిలువ వుంచుకోవొచ్చు ( market లో దర పెరిగాక stored production బైటకి తీయడానికి ). అయితే Essential Commodity Act ప్రకారం ఎక్కువ కాలం వరకు వాళ్ళు ఆ production నీ నిలువ వుంచరాదు.
కొత్త చట్టం : దాన్యాలు ఇపుడు Essential Commodity Act లోనికి రావు, and కొన్న వాడు ఆ ప్రొడక్షన్నీ వాడికి ఇష్టం వొచ్చినన్ని రోజులు నిలువ వుంచుకోవొచ్చు. ( అంటే market లో ధాన్యం రేట్ పెరిగాక, ప్రొడక్షన్ నీ బైటకి తేవడం వళ్ళ కార్పొరేట్స్ కి అధిక లాభం.)
No 3) ఇక్కడ రైతులు వారికి నచ్చిన పంట పండించుకునే అధికారం వాళ్ళకి ఉంది. ఏ పంట వేసుకోవాలి అనేది పూర్తిగా వారి ఇష్టం.
కొత్త చట్టం : ఇందులో contract Farming వుంటుంది అంటే భూమి రైతుదే అయినప్పటికి కార్పొరేట్స్ చెప్పిన పంటనే పండించాలి ( పంటలో ఏ రకమైన తేడా వొచ్చి, లేక ఇంకే కరణమైన చెప్పి, పంట చేతికోచ్చాక వాడు నాకీ పంట వొద్దు అంటే ఇక రైతు చేసేదేమి వుండదు, నిండ మునగాల్సింది రైతులే.
No. 4) మద్దతు ధర కోసమో, మోసానికి నష్టపరిహారం కోసమో ఎంతో కొంతగా రైతులకి కోర్టుకి వెళ్ళే అవకాశం వుంటుంది.
కొత్త చట్టం : నష్టం, మోసం ఏం జరిగిన రైతులు కార్పొరేట్స్ కి వ్యతిరేకంగా కోర్టు మెట్లేక్కే అవకాశం ఏ రకంగానూ లేదు….. బిల్లులోనూ చాలా స్పష్టంగా చెప్పరు contract farming రైతుకి కార్పొరేట్ కి మధ్య కాబట్టి కేంద్రం గాని, కోర్టు గాని ఏ రకంగానూ వారికి సహాయ పడదు అని.
ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తూ,ఇన్ని రకాల లాభాలన్ని కార్పొరేట్స్ కోసం ఏర్పాటు చేసి…. ఇది రైతుల క్షేమం కోసం అని చెప్తే ఇంకా నమ్మడానికి వాళ్ళేమైన బుర్రల్లో పెండని నింపుకున్న భజన భక్తుల? కష్టాన్ని నమ్ముకొని, చెమట చుక్కల్ని నీరుగా పోసి అన్నన్నీ పండించే రైతన్నలు, నిజమైన మట్టిమనుషులు వాళ్ళు….అందుకే ఈ నిరసనలు, పోరాటాలు……
ఒకవైపు వేల సంఖ్యలో రైతులు నిరసనలు చేపడుతూ, రోడ్ల మీదే నివాసం ఉంటూ, ప్రభుత్వం నుండి ఎలాంటి సౌకర్యాలు అంగీకరించకుండా, వారి బతుకుల్ని ఇంకా చిన్నాభిన్నం చేసే అన్యాయమైన ఈ కొత్త చట్టాలని రద్దు చేయాలనే న్యాయమైన డిమాండ్ చేస్తుంటే వారిని ఖాళీస్తానీలు అని, పాకిస్తానీ టెర్రరిస్టులు అని, చైనా దళారీలు అని, హింసని సృష్టించడానికే ఇలా ఈ తీవ్రవాధులంతా రైతుల వేషంలో వొచ్చారని వీళ్ళంతా నకిలీ రైతులని చెప్పి వారిని అవమానించడమే కాకుండా, డబ్బుల కోసమే ఇన్ని నాటకాలు ఆడుతున్నారని తప్పుడు ప్రచారాలని సృష్టించిన ప్రజల్లో వారిమీద తప్పుడు భావనని తయారు చేసి, ప్రజలు వారికి వ్యతిరేకంగా మారేలా ,కళ్ళు ముస్కోని ప్రభుత్వం ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్మి గంగిరెద్దుల తలూపేలా చేయాలనీ కుట్ర పన్నుతుంది.
నిజంగా ఇది రైతు క్షేమం కోసం తెచ్చిన చట్టం అయివుంటే రైతులు సంతోషంచి సంబరాలు చేస్కునేవాళ్ళు కానీ ఇలా ప్రాణాలకి తెగించి పోరాటానికి సిద్దమయ్యేవారు కాదు. వాళ్ళని ఎర్రోళ్ళని చేసి, వారి భూముల్లోనే వాళ్ళని బానిసలుగా చేసి లాభానంత కార్పొరెట్స్ కి కట్టబెట్టే చట్టం, దగా కాబట్టే ఈరోజు వాళ్ళు……మేము భగతిసింగ్ వారసులం అని మీరు చేసే మోసాన్ని సహించబోము అని , ఆయన స్ఫూర్తితోనే పోరాటాన్ని మొదలు పెట్టాము…. చట్టాలు రద్దాయ్యే దాకా ప్రాణాలు పోయిన సరే పోరాడుతూనే ఉంటాము అని చెప్పేవారు కాదు. పంజాబ్ రైతులతో మొదలైన ఉద్యమం ఈరోజు దేశమంతట విస్తరించిదే కాదు…… ఢిల్లీలో అంత విధ్వంసం జరిగుండేదే కాదు, అంతమంది ప్రాణాలు పోగొట్టుకునే వారు కూడ కాదు.
ఎండకి,వానకి , పగలు, రాత్రి తేడా లేకుండ అప్పు తెచ్చిమరి నష్టానికి నష్టం ఎదురైన,దుక్కి దున్నీ పంటని పండించి నేలతల్లి ఒడిలోంచి మెతుకుల్ని తీసి మన కడుపుల్ని నింపే రైతన్నాలీరోజు కార్పొరెట్స్ ప్రభుత్వపు చట్రంలో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతుంటే , వారిపై జరిగే డౌర్జన్యాన్ని చూస్తూ కూడ మనం నోరు కడపకుండా చూస్తూ కూర్చుంటే ఈ నేల తల్లి మనల్ని క్షమించదు. గడ్డి తినే పశువు కూడ దానికి చెడు చేస్తే అది ఇడ్చి తంతది, అలాంటిది మనం మనుషులమండి బాబు రాను రాను ఆ విషయం మర్చిపోతున్నాం.
పండించే రైతు లేకపోతే పస్తులుండి చస్తాం. దేశానికి వెన్నముక రైతు అంటారు అది విరిగితే దేశం నాశనం అయిపోతుంది అందుకే మనవంతుగా కనీసం వారికి మద్దతునిద్దాం, వారికి అండగా నిలబడుదాం. పేద,మధ్యతరగతి, కూలీ, రైతుల రక్తాన్ని పిండి పిప్పి చేసి, వారి శ్రమని దోపిడీ చేసి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన అంబానీ కొమ్ములు విరావడానికి ఇదే సరైన సందర్భం. రైతులు ఇచ్చిన #saynotoambaniadani #saynotojio నినాదంతోనే ముందుకు పోదాం, వీలైనంత వరకు వారి products ని ban చేసి వారి products, malls, petrol pumps అన్ని మూతపడేలా చేస్తే…( కచ్చితంగా చేయగలం రైతులే ఇంత చేస్తే మనమంతా కలిసి ఇంకెంత చేయగలం? ) వాడికి నష్టం తాలూకు బాధని రుచి చూపిన వాళ్ళమౌతాం. దీనితోపాటు ముక్యంగా, ముందుగా చేయాల్సిన పని BJP ని గద్దే దించడం ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం కాదు అంబానీ -అదానీ ప్రభుత్వం ( ofcourse ఏ ప్రభుత్వం అయిన ఇంతే నిన్న మొన్నటి దాక టాటా బిర్లా, ఇపుడు అంబానీ -అదానీ అంతే…… ప్రభుత్వాలు, కార్పొరెట్స్ మారిన రూపం అదే. ), ప్రజాస్వామ్యం ముసుగులో వున్న ఫాసిస్ట్ ప్రభుత్వం. దీనికి ప్రజల సుఖ దుఃఖాలు, లాభ నష్టాలతో పని లేదు, అమాయక ప్రజల శవాల దిబ్బల మీద వ్యాపారం చేసి కార్పొరెట్స్ కి లాభాన్ని దోచిపెట్టే దొంగ ప్రభుత్వం అందుకే దిన్ని కులాదొయాలి లేకపోతే రైతులే కాదు కూలీలు, మహిళలు, విద్యార్థులు, చిన్న -పెద్ద, జాతి -దర్మం, కులం -మతం తేడా లేకుండ అందరం అతి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మన శవాల మీద వీళ్ళు కోట్ల turn over చేస్తారు దేశం స్మశానమాతుంటే ప్రభుత్వం కోట్లు పెట్టి భారీ పార్లమెంట్లనీ, కార్పొరెట్స్ మేడలు మిద్దేలనీ కట్టి తమ గర్వాన్ని ప్రపంచానికి చాటుకుంటాయి.
అందుకే ఈరోజు రైతులతో నిలబడి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదే వుంది లేకపోతే రేపటి మన పిల్లల భవిష్యత్తు భయంకరంగా మారడానికి నువ్వు -నేను కూడ కారణమౌతాం ఆలోచించండి !