రాయలసీమలో అతిపెద్ద రెండవ డయాలసిస్ యూనిట్
- అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద యూనిట్
- రోగులకు మరింత చేరువలో కిమ్స్ సవీర
- ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ సేవలు
డెక్కన్ న్యూస్:
డయాలసిస్ రోగులకు మరింత చేరువైంది కిమ్స్ సవీర హాస్పిటల్. ఇప్పటికే 15 పడకల గల డయాలసిస్ యూనిట్‌ని 26 పడకలకు పెంచింది. సోమవారం హాస్పిటల్‌లో ప్రత్యేక విభాగంలో ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్ యూనిట్‌ని హాస్పిటల్ ఎండీ కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోనే రెండవ అతిపెద్ద డయాలసిస్ యూనిట్‌ని కిమ్స్ సవీర పేరు గడించిందన్నారు. సీమలోని ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆరోగ్య శ్రీ, రైల్వే, ఇహెచ్ఎస్, ఆరోగ్య భధ్రత, ఆరోగ్య సహాయత, ఇన్స్‌రెన్స్ కలిగిన వారికి కూడా ఈ సేవల అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అనంతరం డాక్టర్ భదరినాథ్ మాట్లాడుతూ అనంతపురం పట్టణంలో హెచ్‌డిఎఫ్ (హీమో డయా ఫిల్టరేషన్) మిషన్ కలిగిన ఏకైక ఆసుప్రతి కిమ్స్ సవీర అని పేర్కొన్నారు. దీని ద్వారా బీపీ తక్కువ, లివర్ చెడిపోయిన, తలకు గాయలైన రోగులకు ఈ మిషన్ ద్వారా డయాలసిస్ చేయవచ్చని అన్నారు. డాక్టర్ సురేంద్రబాబుతో కలిసి ప్రతి నెల దాదాపు 1300 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నాని తెలిపారు. ఇప్పటికే 85 శాతం ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలు డయాలసిస్ సేవలు పొందుతున్నారని.. ఇప్పుడు 90శాతం వరకు ఈ సేవలు పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే రైల్వే, ఆరోగ్యసహాయత, ఆరోగ్య భధ్రత, ఇన్స్‌రెన్స్ ద్వారా 15శాతం మంది సేవలు పొంతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కిడ్నీ మార్పిడి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. 7 మంది డయాలసిస్ నిపుణులు, 6 మంది నర్సులు ఎల్లప్పుడు రోగుల సేవలో ఉంటున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రతినెల డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆ రోగులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి తమ బృందం సిద్దంగా ఉందని తెలిపారు.