కొవాగ్జిన్’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా నివారణకు రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ పురోగతిపై భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్ జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సన్నద్ధత, ట్రయల్స్ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
‘కొవాగ్జిన్’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
పర్యటన ముగిసిన అనంతరం భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ బృందం ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేస్తోందని.. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకొచ్చేందుకు కృషిచేస్తోందని కొనియాడారు. భారత్ బయోటెక్ సందర్శన అనంతరం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి పుణె బయల్దేరి వెళ్లారు. పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ఆయన సందర్శించనున్నారు.