కేటీఆర్ ఆవేశమే పార్టీని ముంచుతోందా?
గ్రేటర్ ఎన్నికలో బరిలో అన్ని పార్టీల ప్రచారం తార స్థాయిలకు చేరింది. ఇప్పటికే నువ్వా, నేనా, బస్తీమే సవాల్ అంటూ ఒకరికొకరు సవాల్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా… తెరాస పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ యొక్క మాట తీరు ప్రభావం పార్టీకే నష్టం తెచ్చేలా ఉందంటున్నారు పార్టీ నేతలు.
గ్రేటర్ ఎన్నికల్లో నగరంలో ఇప్పటికే రోడ్ షోలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తన భాష, యాస, విపక్షాలపై పంచులు వేయడంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అయితే కాస్త హద్దుమీరి మంత్రి ప్రసంగాలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇది ఎన్నికల్లో తెరాస మీద పూర్తి వ్యతిరేకత చూపుతుందుని పేర్కొంటున్నారు.
ఇటీవల ఐడిపిఎల్ వద్ద జరుగుతున్న రోడ్ షో బొంతు రామ్మెహన్ కూడా ఉన్నారు. వాహనంపై ఉన్న కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో మేయర్ బొంతు వేరొక మైక్ అందిస్తుంటే ….. అసభ్య పద జాలంతో మేయర్‌నే నడిరోడ్డుపై వందల మంది ప్రజల ముందు తిట్టేశారు.
అలాగే యూసఫ్‌గూడ ప్రచార కార్యక్రమంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్న అతన్ని ముందుకా.. దండం పెట్టుకో…. వెనక్కి వెళ్లు అని ఇలా అనడంతో సోషల్ మీడియాలో పూర్తి వ్యతిరేక పవనాలు వీచాయి. ఇలా చాలా సంఘటనలు పార్టీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని పార్టీ సీనియర్ నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని బలంగా తయారు చేస్తే…. ఇప్పుడు కేటీఆర్ తన అసభ్య పదజాలంతో మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతుందని, ఒక వేళ గ్రేటర్‌లో ఆశించినన్ని సీట్లు రాకపోతే దానికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాలని మంత్రులు, ఎమ్మెల్యులు తమ వారి దగ్గర అంటున్నారని ప్రచారం జరుగుతుంది.
ఏదీ ఏమైన ప్రచార బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ఎలాంటి విజయాన్ని అందిస్తారో వేచి చూడాలి మరి.