చికెన్‌పై ఎన్నికల స్పెషల్ ఆఫర్
- కిలో చికెన్ ధరలో 25% రాయితీ
- సుభాష్‌నగర్‌లో కాంగ్రెస్ అభిమాని సంపత్ వినూత్న ఆఫర్
“కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. జీహెచ్ఎంసీని బతికించండి. కిలో చికెన్ తీసుకోండి.. కరోనాను జయించండి. కాంగ్రెస్ పార్టీ అభిమానులు వెయ్యిమందికి కిలో చికెన్ ధరలో 25% రాయితీ ఇస్తా” అంటూ సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి చికెన్ దుకాణం యజమాని సంపత్ వినూత్న ఆఫర్ ఇస్తున్నారు. తమ కుటుంబంలో కొన్ని తరాలుగా కాంగ్రెస్ అభిమానులమేనని, తమ రక్తంలోనే ఆ పార్టీ ఉందని సంపత్ చెబుతున్నారు. ఈసారి సుభాష్‌నగర్ డివిజన్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువ అభ్యర్థిని తానం శ్రావణి శ్రీధర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయన శుక్రవారం నుంచి తొలి వెయ్యిమంది ఓటర్లకు చికెన్ ధరలో 25% ప్రత్యేక రాయితీ అందిస్తున్నారు.
డివిజన్ పరిధిలో ఉన్న పలు బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రావణినే ఎన్నుకోవాలని, ఆమెకు, ఆమెభర్త శ్రీధర్‌రెడ్డికి డివిజన్ పరిధిలోని గల్లీ గల్లీ పరిచయమేనని.. ఇక్కడి ప్రజల గుండెల్లో వాళ్లు గూడు కట్టుకున్నారని సంపత్ అంటున్నారు. అందువల్ల శ్రావణి గెలుపే డివిజన్ అభివృద్ధికి మేలుమలుపు అవుతుందని వివరించారు. కరోనా కాలం కావడం వల్ల తగినంత దూరం పాటిస్తూ తమ దుకాణానికి వస్తే తొలి వెయ్యి మంది ఓటర్లకు ఈ రాయితీ అందిస్తానని, చికెన్ తిని రోగనిరోధక శక్తి పెంచుకుని కరోనాతో పోరాడాలని కోరారు. దుకాణంలో పెట్టిన ఈ ప్రత్యేక ఆఫర్ కౌంటర్‌ను సుభాష్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని తానం శ్రావణి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించి, తొలి ఐదుగురికి కిలో చొప్పున రాయితీ ధరకు చికెన్ అందించారు.