ల‌వ్ జిహాద్‌కి వ్యతిరేకంగా కొత్త చట్టం..!!

ప్రేమ వ‌ర్ణించ‌లేని ఓ మ‌ధుర జ్ఞాప‌కం. ఈ జ్ఞాప‌కాల‌తో ఎంతో మంది జీవితాలు గడిపేస్తారు. దేశంలో ప్రేమ‌ను వ్య‌క్త ప‌ర‌చ‌డానికి కూడా అడ్డంకులు వ‌స్తున్నాయి. ల‌వ్ జిహాది మీద ఓ సామ‌న్య భార‌తీయ మ‌హిళ రాసిన క‌థ‌నం చ‌ద‌వండి.

లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా చట్టం తేవాలనే ప్రస్తావనని కూడ మొదటిసారి, తల్లుల గర్భాలకి కూడ మతాన్ని అంటగట్టడానికి, పిల్చుకునే శ్వాస స్వేచ్చని కూడ హరించి,నే చెప్పిన చోటనే పిల్చాలనే నిర్బంధాన్ని “గర్భ సంస్కారం” అనే పేరుతో చట్టాన్ని తెచ్చిన….. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ పెట్టాడు. మెల్లిమెల్లిగా అది దేశం మొత్తంలో భాజ‌పా రాష్ట్రాలన్నిటిలో ( హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ) పాకింది. భాజ‌పా రాష్ట్ర ప్రబుత్వాలన్నీ ల‌వ్‌ జిహాద్ కి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలనే ఆలోచనని బలపరుస్తూవొచ్చాయి. ఇపుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ కూడ బీహార్లో  లవ్ జిహాద్ ని ఆపాలి అంటే దానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాల్సిందే, తీసుకువొస్తాం, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు కూడ చట్టం తీసుకురావడం సరైనదే అని వారి ఏకీభావాన్ని చాటారు తొందర‌లోనే లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా దేశమంతా కొత్త చట్టం తీసుకొస్తాం అంటూ గొప్పగ చెప్పుకొచ్చాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా “ధర్మ స్వతంత్ర అదినీయం 2020” అనే పేరుతో చట్టం తేనుంది. ప్రభుత్వం దీని డ్రాఫ్ట్ కూడ చేసి పెట్టింది, డిసెంబర్ -జనవరి లో విధానసభలో దీన్ని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి రాష్ట్రపతి కి కూడ పంపనున్నారు.
మతం మీద, ఆ మతపు మనుషుల పట్ల వున్న ద్వేషాన్ని ప్రభుత్వం ఈ  రకంగా కసి తీర్చుకుంటుంది అనటంలో ఏమైన సందేహం వుందా? ప్రేమకి కులాలతో -మతాలతో సంబంధం ఏంటి? ఒక మనిషిని మనిషిగా చూసి గౌరవించమంటుంది ప్రేమ…… మనుషుల ( స్త్రీ -పురుషులు ) మధ్య ఆలోచనలు ఒక్కటిగా ఉన్నపుడు, ఇద్దరి ఇష్టాలు -సిద్ధాంతాలు ఒకటైనపుడు సాధారణంగానే ఒకరిపట్ల ఇంకొకరికి ఇష్టం కలగడం ఆ ఇష్టం ప్రేమగా మారడం జరుగుతుంది….. అది ఇద్దరి ( స్త్రీ -పురుషులు ) వ్యతిగత విషయానికి, జీవితానికి సంబందించిన విషయం కదా? పెళ్ళి చేసుకొని రేపొద్దున జీవితం అంత కలిసి నడవాల్సింది, బతకాల్సింది వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ వుండాలి, వుంటే అది వాళ్ళ ఇష్టం అవుతుంది కానీ, కాదని చెప్పడానికి నువ్వైన, నేనైన, ప్రభుత్వం అయిన ఎవరు? మీ వ్యతిగత ద్వేషాన్ని బాధ్యత గల ప్రభుత్వం లో వుండి కూడ ప్రేమకి మతాన్ని అంట గట్టి దాన్ని నిషేధించడానికి వాళ్ళ వ్యతిగత స్వేచ్ఛ మీద నీకు హక్కు ఎవరిచ్చారు? కులాలకి మతాలకి అతీతమైనదే ప్రేమ….. దానికి మంచి మనసుతో  సంబంధం కానీ నువు చెప్పే కంపుకొట్టే కులంతోను కాదు….. నీ ఓట్ల రాజకీయ లాభం కోసం పావు లాగా వాడుకునే ని మతము కాదు…….నిజంగా జాతి మీద, దేశం మీద, దేశ ప్రజల మీద ప్రేమ వున్నవాడు…. ప్రజల ఇష్టాలని ప్రేమిస్తాడు కానీ…. మతం సాకు చెప్పి అమాయక పిల్లల్లో వున్న ప్రేమని చంపాలనుకోడు, అల అనుకునేవాడు మతోన్మాది, ఉన్మాధి అవుతాడు కానీ బాధ్యత గలవాడు ఎప్పటికి అవ్వలేడు.
ఇది ప్రేమకి మాత్రమే వ్యతిరేకమైన చట్టం కాదు…. రాజ్యాంగ వ్యతిరేక, మహిళా వ్యతిరేక ( వారి ఇష్టాన్ని, ప్రేమని దిక్కరించ్చే ), ప్రజా వ్యతిరేక చట్టం.130 కోట్ల జనాభా గల భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం అని గర్వాంగ చెప్పుకునే దేశం, ఇక్కడ అన్ని మతాల వారు, కులాల వారు వుంటారు, ఎవరీ వ్యతిగత స్వేచ్చ వారిది…. వారి ఇష్టాల మీద, ప్రేమల మీద ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఇది నియంత ప్రభుత్వం అందుకే ప్రజల్ని వారి మధ్య వున్న స్నేహభావాన్ని -ప్రేమని మతం పేరుతో కల్లోలాలు సృష్టించి ముందు మతాలుగా విడదీసి, తరవాత కులాలుగా, ఆ తర్వాత ఉపకులాలుగా ఇలా విభజించుకుంటూ పోయి అందరిని ముక్కలు చేసి చివరికి అగ్రవర్ణం వాళ్ళకి మరియు కార్పొరేట్స్ కి లాభాన్ని తెచ్చి పెడుతుంది….. దేశ జనబానంత ఆగం చేసి, దేశాన్ని నాశనం చేసి ఆ 3% గాళ్ళని అందలం ఎక్కించి దానికి మేం బానిసలం అంటూ బాహాటంగానే తెలుపుతోంది.

భాజాపా వ‌చినప్పటి నుండి స్థలాలకి, స్టేషన్స్ కి పేర్లు మార్చడం, ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకురావడం, పేద పిల్లల కోసం వున్న స్కూల్స్ నీ విశ్వ‌విద్యాల‌యాల‌ని మూయించడం, విద్యార్థులకి -మహిళలకి -రైతులకి వ్యతిరేకంగా చట్టాలు చేయడం, రైల్వేస్ -ఎయిర్పోర్ట్స్ అన్ని అంబానీ అదానీలకి అమ్మడం, రాత్రికి రాత్రే నోట్ల రద్దు….. కరోనా కాలంలో లో ఏ ముందస్తు జాగ్రత్తలు, ఎలాంటి ఆలోచ‌న లేకుండ పొద్దున కళ్ళ లౌక్ డౌన్‌ ప్రకటించడం వళ్ళు ప్రతిసారి జనాలని చంపుకు తిన్నదే గాని పైసా పనికొచ్చే పని చేయలేదు పైగా సంవత్సరానికీ 2 కోట్ల  ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వమే వున్న ఉద్యోగాలు కూడ ఊడేలా చేసింది ప్రజల్ని రోడ్డు పాలు చేసింది……లౌక్ డౌన్‌ మూలంగా దిక్కులేక పేదలంతా తిరిగి వెల్దామంటే కూడ కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్దాక్షయంగా వాళ్ళందరిని పొట్టన పెట్టుకుంది….. వాళ్ళ చావులకి కారణం అయింది.
ఇపుడేమో మతం, ఆ మతపు మనుషుల మీద వున్న కోపాన్ని ద్వేషాన్ని…… ప్రజల్ని వారిలో వారికే తగువులు పెట్టి చిన్నాభిన్నం చేయడానికి లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా ఈ కొత్త చట్టం తేనుంది. ఇది ముమ్మాటికీ మితి మీరిన ఫాసిజమే…… నిజంగా దేశానికి,ప్రజలకి మంచి చేయాలి అనుకుంటే చేయాల్సిన ఎన్నో మంచి పనులు వున్నాయి వాటి వాళ్ళ జనాలు బాగుపడటమే కాకుండా, దేశం బాగుపడుతుంది, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, ఆదివాసీలు, దళితులు అందరి జీవితాలు బాగుపడి దేశం ప్రగతినీ గాంచుతుంది…… దేశ సామాజిక, ఆర్థిక ప‌రిస్థితి కూడ బాగుపడుతుంది. అంతే కానీ అవి కాకుండ ఇలాంటి తల తోకకి  సంబంధం లేని చట్టాలని తీసుకురావడం అంటే ప్రజల్ని కావాలని రెచ్చగొట్టడం, వారిలో మతోన్మాదాన్ని పెంచి ఉన్మాదులుగా మార్చడం, దేశాన్ని మతం పేరుతో ముక్కలుగా చీల్చడమే అవుతుంది.
అందుకే దీన్నిక్కడే నువ్వు -నేను ఖండించకపోతే, ప్రేమ దాని ఉనికిని కోల్పోయి ద్వేషం విజయ పథకాన్ని ఎగరేస్తుంది, దేశం స్మశానమౌతుంది.మతద్వేషంతో తెచ్చే ఈ చట్టాన్ని …… ప్రేమని కాపాడుకునేందుకైనా మనం వ్యతిరేకించాల్సిందే.
– అను శ్రీ‌…