ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా

తెలంగాణలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే పేరుతో దందాలు చేస్తూ… భయబ్రాంతులు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవి నగర్,మైలారం ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని పక్కా సమాచారంతో 8 లారీలు 2 జెసిబి లను సీజ్ చేసి,7గురు పై కేసు నమోదు చేసిన గణపురం ఎస్ హెచ్ ఓ ట్రైనీ ఐపీఎస్ సుధీర్ రామ్నాథ్ కే కన్ తెలిపారు.