రాముల‌మ్మ రాక బీజేపీకి ఎంత లాభం ?

విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ, ఓ ఫైర్ బ్రాండ్ ఇటు రాజ‌కీయాల్లో, అటు సినిమాల్లో. కానీ గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా… అంటి ముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు.అయితే ఈ త‌రుణ‌లంలో ఆ పార్టీకి గ‌ట్టి షాకిస్తూ… కాంగ్రెస్ బై బై చెప్పి, సొంత గూటికి రాముల‌మ్మ వెళ్ల‌నున్నారు. రాముల‌మ్మ రాక భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎంత లాభాన్ని చేకూర్చుతుంది అనేది ఇప్ప‌డు ప్ర‌శ్నార్థకం.

ఒక‌ప్పుడు సౌముల్య‌కు నిల‌యంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ బండి సంజ‌య్ రాక‌తో ఒక దూమ‌ర‌మే లేపుతుంద‌ని చెప్పుకోవ‌చ్చు. ఏనాడు కూడా తెలంగాణ‌లో పార్టీకి ఇంత పెద్ద ప్ర‌చారం క‌ల‌గ‌లేదు అనే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి తెలంగాణ‌లో క‌మ‌లం పూల రెక్క‌లు విస్తున్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ నిపుణ‌లు. క్లాస్‌తో పాటు మాస్ లీడ‌ర్లు ఉంటేనే త‌ప్పా తెరాస‌ను గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేము అనేది స్ప‌ష్టంగా ఒంట‌ప‌ట్టించుకుంది ఆపార్టీ. ఈ నేఫ‌థ్యంలో అనేక మంద‌ని అటు కాంగ్రెస్‌, తెరాస‌, టీడీపీల నుంచి త‌మ పార్టీలోకి చేర్చ‌కుంటుంది.

అయితే కాంగ్రెస్ పార్టీలో  ప‌నికి రాని స‌రుకంతా భాజ‌పాలోకి వెళ్తుతుంద‌ని, దీని వ‌ల్ల త‌మ పార్టీకి వ‌చ్చిన న‌ష్టం ఏం లేదంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. అయితే అందరు పార్టీలోంచి వెళ్లిపోవ‌డం ఓ ఎత్తూ… విజ‌య‌శాంతి వెళ్ల‌డం మ‌రో ఎత్తూ అనేది అంద‌రికీ తెలుసు. ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అభిమానులుగా చేసుకున్న ఘ‌న‌త అమెది. రాజ‌కీయ కోణంలో చూస్తే విజ‌య‌శాంతికి మంచి పేరే ఉంది. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం నుండి ఎన్నికై  ఉద్య‌మ స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషిచింది. కేసీఆర్ కి దగ్గ‌రై, మ‌ళ్లీ దూర‌మైన సంగ‌తుల గురించి మ‌న‌కు తెలుసు.

ఈ స‌మ‌యంలో భాజ‌పాలోకి ఆమె రావ‌డం పార్టీకి మంచి శుభ‌ప‌రిణామ‌మం అంటున్నారు భాజ‌పా నేత‌లు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌ని వీడి భాజ‌పాలో చేరిన డీకే.అరుణ జాతీయ స్థాయ‌లో ప‌ద‌వుల‌ను సొంతం చేసుకుంది. మాస్ ఇమేజ్ క‌లిగిన రాముల‌మ్మ పార్టీలో చేరి ప్ర‌జ‌ల్లో ఉంటే… 2023 టార్గెట్‌గా పని చేస్తే ఖ‌చ్చితంగా ఉన్న‌త‌మైన ప‌ద‌వి భాజ‌పాలో ద‌క్కే అవ‌కాశం ఉంది. సీఎం ప‌ద‌వి లేదా మంత్రి హోదా ఖ‌చ్చితంగా రాముల‌మ్మ‌ను వ‌రిస్తుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.