నమస్తే తెలంగాణలో కనిపించని హారీష్
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హారీష్‌రావుకి గడ్డుకాలం ఎదురైందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెరాసకు ఇంటి పత్రికలుగా ఉన్న నమస్తే తెలంగాణ (తెలుగు దిన పత్రిక & వెబ్‌సైట్), తెలంగాణ టుడే (ఇంగ్లీష్) దినపత్రికలు. దీంట్లో పార్టీకి చెందిన వారు ఏవరైన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు చివరికి కార్యకర్తలు మాట్లాడిన పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తారు.
అయితే ఇటీవల దుబ్బాకలో వచ్చిన ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, పటాన్‌చెరువు జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్ అయిన హారీష్‌రావు ఎక్కడా కూడా ప్రచారం కల్పించడం లేదని అంటున్నారు నాయకులు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే ఇంత పక్షపాతం చూపిస్తారా అంటూ హారీష్‌రావు వర్గానికి చెందిన నేతలు బహాటంగానే రాజకీయ వర్గాల్లో చెబుతున్నారు. ఇలా చేస్తే సొంత పార్టీ నుంచే తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మంత్రితలసానికి ఇచ్చిన మార్యద కూడా హారీష్ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రచారం జోరుగా కొనసాగుతుడడంతో హారీష్‌రావుకి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తే కేటీఆర్, కవితలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీ గట్టిపోటీ ఇవ్వడం కూడా తెరాసను కలవర పెడుతున్న అంశం. స్వతహాగా ఆ పార్టీకి సొంత పత్రిక గానీ, టీవీ ఛానెల్ గానీ లేదు. కానీ ఇటీవల వి6, వెలుగు దినపత్రిక, రాజ్ న్యూస్ వంటి ఛానెళ్లు భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. తెరాసకి వ్యతిరేకంగా హారీష్‌రావు ఉన్నారని ఈ ఛానెళ్లో కాస్తా హారీష్‌రావు గురించి సానుకూలంగా ఈ సమయంలో వార్తలు ప్రచూరితం అయితే తెరాసకు గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.