ఎన్నికల కోసం ఫ్రీగా పంచుతున్న దినపత్రిక
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాధరణ పొందడానికి ఒక్కొక్క పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది. తెరాసకు కర పత్రికగా పేరున్న నమస్తే తెలంగాణ (తెలుగు), తెలంగాణ టుడే (ఇంగ్లీష్) పత్రికలను ఉచితంగా నగరంలోని అన్ని ఆపార్ట్‌మెంట్‌లలో వేస్తున్నారని ప్రచారం. ఇలా ప్రతి డివిజన్‌లో ఐదు వేల కాపీలను పంపిణీ చేస్తున్నారంటా. అయితే ఈ పంపిణీ చేసిన హ్యకర్స్‌కి ప్రతి పేపర్ 2 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. అలాగే తెరాస పార్టీ నుంచి పోటీలో ఉన్న ప్రతినిధి ఖచ్చితంగా అన్ని ఇండ్లలో అధికార పార్టీకి చెందిన పేపర్లు పంపిణీ చేయాలని పార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.