ఆరడుగుల బుల్లెట్ ఆగం అయ్యాడా లేదా ఆగం చేశారా ?
KSR
ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో భాగంగ నన్ను నమ్మి పార్టీ అధినేత , మా మామా కేసీఆర్ నన్ను ఇక్కడి పంపింంచాడు. పంపిన ప్రతిసారి విజయంతో ముందుకు వెళ్లిన కానీ ఏనాడు కూడా ఓటమిని చవి చూడలేదు అని మంత్రి హారీష్‌రావు అన్నారు. దాని తర్వాత వచ్చిన ఫలితం మనం చూశాం. ఆనాడు కనిపించిన హారీష్ రావు ఇనాటి మళ్లీ మీడియా ముందుకు రాలేదు. అయితే అతని పార్టీ నుంచి పక్కకు తప్పించడం అంటే మీడియాలో, ఎన్నికల ప్రచారంలో కనిపించకుండా చేయాలని అందుకే ప్రక్కన బెడుతున్నట్లు సమాచారం. ఇందుకు పెద్దయాన మనసులో ఓ పెద్ద కారణమే ఉందట.
మామ వదిలలిన బాణం పక్కతోవ పడుతుందని పార్టీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ సీఎం సొంత జిల్లా, అందులోనూ ఇటు సీఎం కేసీఆర్, అటు మంత్రి హారీష్‌రావు నియోజకవర్గాల మధ్యలో ఉన్న దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ పగా వేయడం సీఎంను పూర్తిగా నిరాశ పరిచిందట. ఓటర్లను ఆకట్టుకునే హరీష్‌రావు చేసిన అతి ఓవర్ యాక్షన్ వల్లే దుబ్బాకలో ఓటమి పాలు అయ్యారని ఇది పార్టీ మీద చాలా ప్రభావం చూపితోంది అంట. వెంటనే వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ హారీష్‌రావుని ముందు బెడితే మొదటికే మోసం వస్తుందేమో అనే భయంతో కేసీఆర్ హారీష్‌రావుని సైడ్ చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. నామికే వాస్తుగా పటాన్‌చెరువు బాధ్యతలు అప్పగించినా… అతను అయిష్టంగానే ఉన్నారని సమాచారం.
ఇక హైదరబాద్‌లో కేటీఆర్, కవితలను కూడా ముందుకు తీసుకరావడం వెనుక మంచి రాజకీయ వ్యుహామే ఉందని సమాచారం. ఒకవేళ హైదరబాద్‌లో తెరాస విజయం సాధిస్తే ఆ విజయాన్ని కేటీఆర్, కవితల ఖాతాలో వేసి తమ రాజకీయ వారసులు నా బిడ్డలే అని చెప్పి 2023లో కేటీఆర్‌ని సీఎం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నరాని పార్టీ సీనియర్ నేతలు వారి మిత్రులుకు చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది.
నిజానికి హారీష్‌రావు చేసిన పోరబాట్లే అతన్ని ఆగం చేశాయా లేదా ఆగం చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.