పాకిస్థాన్‌ని వేదిస్తున్న సంతాన సంక్షోభం
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ప్రపంచంలో పాకిస్థాన్ పేరు గడించింది. దేశంలో గత కొంత కాలంగా వివిధ సంక్షోభాలు బాధిస్తున్నాయి. ఆర్థికంగా, ఆహారం సంక్షోభాలు ఏర్పడినప్పుడు పొరుగు దేశాల సాయం కోరి వివిధ పంటలను దిగుమతి చేసుకుంటాయి. అప్పడప్పుడు మన దేశం నుండి కూడా ఆహార ధాన్యాల ఎగుమతి జరుగుతుంటుంది.
కానీ ఇప్పుడు ఆ పాకిస్థాన్‌ని రాజకీయ, ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాటు సంతాన సంక్షోభం వేధిస్తుంది. సంతాన సంక్షోభం ఏంటీ అనుకుంటున్నారా. ఇటీవల కాలంలో వింత వ్యాధి పురుషులను ఇబ్బంది పెడుతున్నాయని ఆ దేశంలోని పలు సర్వేలు వెల్లడించాయి.
అజుస్పెర్మియా అనే వ్యాధి పాకిస్థాన్ పురుషులపై తీవ్ర ప్రభావం చూపుతోందంట. ఈ వ్యాధి వల్ల వీర్యకణాల లేమి ఏర్పడుతుందని, దీతంతో సంతాన సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు అక్కడి అధికారులు. అయితే ఇప్పటికే పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సమాచారం.