కేసీఆర్ కవితలకు పొసగడం లేదా ?
KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కూతురు కవితల మధ్య మాటల సమన్వయం లేకుండా పోతుంది. వీరి ఇద్దరి మాటల మధ్యనే ఇంత తేడా ఉంటే ప్రజలకు ఎలా నచ్చచెబుతారు. వారంతా ఒక్కటేనని ఎలా నిరూపిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీని అటు కాంగ్రెస్ పార్టీలను అడ్డుకోవమే. ఇందుకు సరైన రాజకీయ అనుభవం ఉండాలి. ఏది పడితే అది అంటే ప్రజలు విశ్వసించేలా లేరు. ఇప్పటికే తెరాస మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు తండ్రి, కూతురుల మధ్య మాటల సమన్వయం లేక పోవడం పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది.
ఇటీవల హైదరబాద్‌లో వచ్చిన వరదల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. దీన్ని అదునుగా భావించి టీఆర్ఎస్ సర్కార్ 10వేల ఆర్థిక సాయాన్ని ప్రజలకు అందించింది. నగరం మొత్తం పంపిణీ చేయాలంటే కష్టమైన పని. దీన్ని ఎలాగైన ఆపాలి అని అనుకుంటున్న తరుణంలోనే గ్రేటర్ ఎన్నికల యుద్దం మొదలైంది. దీంతో ఎన్నికల కమీషన్ డబ్బుల పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపాన్ని భారతీయ జనతా పార్టీపై మోపాలని ఉద్దేశ్యంతో కేసీఆర్ మాట్లాడుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదివేల సాయాన్ని ఆపాలని లేఖ రాశారని ఆరోపించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా…
మరోవైపు సీఎం కూతురు కవిత మాత్రం కాంగ్రెస్ వారు వరద సాయాన్ని ఆపారని ట్విటర్ ద్వారా కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తుంది.
అయితే తండ్రి ఒక మాట, బిడ్డ ఒక మాట చెబుతుంటే పార్టీ కార్యకర్తలే ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు.