క‌ళ్యాణ లక్ష్మీలో అక్ర‌మాలు సీబీఐతో విచారణ

కళ్యాణ లక్ష్మీ ప‌థ‌కంలో జరిగిన అక్రమాలను సిబిఐ తో విచారణ చెప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ యకులు డిమాండ్ చేశారు.శుక్రవారం రోజు ఇచ్చోడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ స్కామ్ లో ఎంత పెద్ద నాయకుడైన , అధికారి అయిన కఠినంగా శిక్షించాలని అన్నారు. కేసీఆర్ పాలనలో అధికారులకు జవాబుదారితనం లేకుండా అవినీతి పెరిగిపోయిందన్నారు. తెరాస పాలనలో అవినీతి ఏ మేరకు జరుగుతుందో దీనికి కళ్యాణ లక్ష్మీ కుంభకోణం ఒక ఉదాహరణ అని అన్నారు.కార్యక్రమంలో అల్ ఇండియా కంజుమర్ ప్రొటెక్షన్ ఫోరం ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ,పిఏసీఎస్ చైర్మన్ సూర్యకాంత్ గిత్తే , పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాథోడ్ సుభాష్ ,గోవింద్ లు పాల్గొన్నారు.