గ్రేటర్‌లో పవనిజం పనిచేస్తుందా ?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్ని పార్టీలు తమ అభ్యుర్థుల జాబితాలను ప్రకటించాయి. అయితే ఇక ప్రచర కార్యక్రమాలు ఆలస్యమే. కాగా తెరాస ఇప్పటికే ప్రచార కర్తగా కవితను, కేటీఆర్‌ని రంగంలోకి దింపాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక భాజపా ఒంటరి పోరులో జనసేన పార్టీ కలిసి వస్తుందా అనేది ఇప్పుడు ప్రశార్థకంగా మారింది. ఏపీలో భాజపాకు గట్టి మద్దతు ప్రకటించిన జనసేన తెలంగాణలో మాత్రం అంటి ముట్టనట్లు ఉంటోంది. అయితే ఇక్కడ కూడా భాజపాకు జనసేన మద్దతు ప్రకటిస్తే ఖచ్చితంగా తెరాస గట్టి పోటీ ఉంటుందని భాజపా సీనియర్ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కూడా చీల్చే అవకాశం ఉందని. అలాగే పవన్ అభిమానులు కూడా భాజపాకు ఓటు వేసే అవకాశాన్ని వదులు కోవద్దని కమలం వ్యుహ్యం రచిస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రుకవారం జనసేన పోలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ తో చర్చలు జరపడానికి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు నాయకులు హైదరబాద్‌లో నాదెండ్ల నివాసంలో సమావేశమైనారు.
ఈ సమావేశంలో పార్టీ మద్దతు తో పాటు అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా ప్రచారంలోకి తీసువచ్చి ఓటర్లను ఆకర్షితులను చేయాలని భాజపా నేతలు అనుకుంటున్నారు. అయితే ఈ సమావేశంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి మరి.