సోనియా గాంధీ ఆరోగ్యం సన్నగిల్లుతోందా ?
సోనియాగాంధీ భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె ఇప్పుడు అనారోగ్యం వల్ల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతోంది. గత కొంతకాలంగా ఢిల్లీలోని గంగారామ్‌ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శీతకాలం మొదలవగానే ఆమె ఆరోగ్యం మరింత ఇబ్బందిగా మారిందని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. ఛాతీలో ఇన్ఫెక్షన్ల వల్ల ఆమె ఇబ్బంది పడుతున్నారని గత కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లి వైద్యం కూడా చేయించుకున్నారు. అయితే శీతకాలం వల్ల ఢిల్లీలో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో సోనియా గాంధీ ఆరోగ్యం మరింత ఇబ్బంది కరంగా మారిందని పట్టణానికి దూరంగా ఉంటే కాస్త కుదట పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సోనియాని చైన్నై లేదా గోవాకి తీసుకవస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. అయితే సోనియాని ఒంటరిగా పంపకుండా రాహుల్ లేదా ప్రియాంక గాంధీలను వెంట వస్తారని సమాచారం.