యువత భాజపా వైపే చూస్తున్నారా ?
భారతీయ జనతా పార్టీ అంటే… అర్బన్ ఏరియాలో మాత్రమే ఉండేది అనేద బాగా ప్రచారం. అయితే ఇటీవల తెలంగాణ జరిగిన దుబ్బాక ఎన్నికలల్లో వచ్చిన ఫలితం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. ఆ ఎన్నికల ఫలితాన్ని ఆస్వాదించకముందే… వెంటనే గ్రేటర్‌లో ఎన్నికల హడవుడి మొదలైంది. అయితే ఆ ఫలితం ఇక్కడ పని చేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
గ్రేటర్ ఫైట్‌కి అధికార పార్టీకి ధీటుగా సమాధానం ఇచ్చేలా ఓటర్లను ఆకర్షించేలా హామీలిస్తుంది భాజపా. ప్రధానంగా యువకులను టార్గెట్ చేసింది కమలదళం. యువకుల ఐక్యమత్యమే పార్టీ అండగా ఉంటుందని పార్టీ సారధి బండి సంజయ్ నమ్మకం. ఇందులో భాగంగానే గ్రేటర్ లో భాజపా అధికారంలోకి వస్తే అన్ని బైక్ చాలన్లు మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక ముఖ్యంగా చదువుకున్న యువత భాజపాకే మొగ్గు చూపిస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.మరో వైపు కాస్తా స్లమ్ ఏరియాలో ఉన్న యువత మాస్ లీడర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ హిందుత్వం అనే అంశం మీద వారు కూడా కమలం వైపే దారి పట్టే అవకాశం ఉందంటున్నారు.