బావను దుబ్బాక ఓటమి రిపోర్ట్ ఇవ్వాలని కోరిన కేటీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల్లో కంగుతిన్న తెరాస… ఓటమిపై పోస్ట్‌మర్టం మొదలు పెట్టింది. ఈ ఓటిమి తెరాసలో తీవ్ర ప్రకపంనలను తీసువచ్చే విధంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఆతర్మదనంలో ఉన్న హారీష్‌రావుని దుబ్బాక ఓటిమిపై రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరినట్లు సమాచారం. దుబ్బాకలో గ్రామ స్థాయి నుంచి మండలాలలో నియమించిన ప్రతి ఇంఛార్జి దగ్గర నుండి ఓటమికి గల కారణాలు చెప్పాలని కేటీఆర్ స్వయంగా హారీష్‌రావుకి తెలిపారని సమాచారం. ఈ రాజకీయ దూమరం ఎటువంటి సంచనానైన సృష్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. అయితే పార్టీ ఓటమికి తెరాస పరిమితికి మించిన కాన్‌ఫిడెన్స్ ఉండడం వల్లే ఈ ఫలితం వచ్చిందంటున్నారు స్థానికులు. మరీ కేటీఆర్ చేతిలోకి ఓటమి రిపోర్ట్ వెళ్లిన తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.