బిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక
రోజు రోజుకి మానవీయ విలువలను దిగజారుతున్నాయి. అభం శుభం తెలియని అమాయక బాలికలను అఘాయిత్యాలు చేసి పాడు చేస్తున్నారు. దీంతో 13 ఏళ్ల బాలిక ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ దారుణమైన ఘటన గుజరాత్లోని జామ్ నగర్లో చోటు చేసుకుంది. జామ్ నగర్లోని ఓ ఆసుపత్రిలో బాలిక ప్రపవించిన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏడు నెలల క్రితం ఆనందపూర్ గ్రామ శివారులో ఓ కూలీ బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే అప్పటి నుంచి బాలిక ఎక్కడ ఉంది, ఈ ఘటన జరిగిన తల్లిదండ్రులు ఎందుకు స్పందించలేదు అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.