గ్రేటర్ లో కేటీఆర్ వ్యుహాలు ఫలిస్తామా ?
వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ ఫైట్‌కి సిద్దంగా ఉండాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఎన్నికల యుద్దానికి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ రథసారధిగా ఉంటారని తెలిపారు. పార్టీకి అండగా కార్యకర్తలు ఉన్నారని వారు ఎక్కడికి వెళ్లలేదని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసి గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించాలని సూచించారు. ఇతర పార్టీలతో పోలిస్తే హైదరాబాద్‌లో తెరాసకు మంచి ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. దుబ్బాక ఎన్నికల ప్రభావం ఏమాత్రం ఉండబోదన్నారు.
అయితే ఇప్పటికే దుబ్బాక ఎన్నికల్లో తలకిందులైన పార్టీని గట్టేక్కించే దమ్ము మంత్రి కేటీఆర్ ఉందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న కొంత మంది కార్పొరేటర్లకు టిక్కెట్లు దక్కే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశారు కేటీఆర్. మరోవైపు గ్రేటర్‌లో తన ముద్ర వేయాలనే ఆలోచనతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఓ పక్క కోటరీ ఏర్పరుచుకుంటున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై మాల్కజిగిరి నియోజవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమావేశమై తలసాని శ్రీనివాస్ వ్యతిరేకంగా ప్లాన్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఇక ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన భాజపా ఎటువంటి వ్యుహాంతో గ్రేటర్‌లో అడుగుపెడుతుంది అనేది వారికి ప్రశ్నార్థకంగా ఉంది. భాజపా, కాంగ్రెస్ కళ్లెం వేయడానికి ఎటువంటి వ్యుహాలతో కేటీఆర్ ముందుకు వెళ్తారనేది చూడాలి. అయితే గ్రేటర్‌పై కేటీఆర్‌కి పట్టు ఉందా అనే విషయం పక్కనబెడితే ఆయన మీద వ్యతిరేకత ఏమేరకు ఉంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సీఎం కూమారుడు, మంత్రి అనే హోదాతో పెద్దా, చిన్నా తేడా తెలియకుండా పార్టీ నేతలతో వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు దగ్గరివారితో చెప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యతిరేకతో ముందు వెళ్తారా లేదా అందరి కలుపుకొని వెళ్తారా, ఎటువంటి వ్యుహాలతో ముందుకు వెళ్తారో , ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.