డిగ్రీలు చదివి ఛాయిలు అమ్ముకోవాలా?
తెలంగాణ రాష్ట్రం వచ్చాక చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం ఆ బిడ్డలను హీనంగా చూస్తుంది అని విమర్శించారు వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి.
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ లో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం రాక టీ అమ్ముకొంటూ జీవితం సాగిస్తున్న పసునూరి అనిల్ కుమార్ తో ఆయన మాట్లాడారు. త్వరలో జరిగే ఈ ఎన్నికలలో సమస్యలపై అవగాహన, చిత్తశుద్ధి ఉన్న నన్ను గెలిపిస్తే ఉద్యోగ ఖాళీ ల భర్తీకి పోరాడుతా గెలిపిస్తే సర్కారుతో కొట్లాడి యువతకు న్యాయం చేస్తానని అన్నారు.