కిమ్స్‌లో ఆధ్వర్యంలో గర్భిణీలకు ఫ్యాషన్ షో
పెళ్లయిన దంపతుల్లో భార్య గర్భం దాల్చిందంటే ఆ దంపతులిద్దరి జీవితంలో చాలా అందమైన రోజులని అర్థం. కానీ, అది కూడా ఒక్కసారి మారిపోయింది. బోలెడంత ఒత్తిడి, సమాధానం లేని అనేక ప్రశ్నలు, భద్రతకు సంబంధించిన ఆందోళనలు వచ్చాయి. అత్యంత ముఖ్యమైన, గర్భం సమయంలో చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలకూ బయటకు రావడం మానేశారు.
ఈ పరీక్షాకాలంలో గర్భిణులలో ఒత్తిడిని తగ్గించడం, వారికి జాగ్రత్తలు చెప్పడం, జీవితాంతం గుర్తుపెట్టుకునేలాంటి సంతోషాన్ని, అదే సమయంలో కాబోయే తల్లిగా వారికి తగిన రక్షణను అందించడం మన బాధ్యత.
2020 సంవత్సరంలో కిమ్స్ కడిల్స్ ఈ సవాలును మరోసారి స్వీకరించింది. అందుకే మిసెస్ మామ్ సీజన్ 4ను 2020 డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో గల లీ మెరిడియన్ హోటల్లో రాత్రి 7 గంటల నుంచి నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో అన్నిరకాల జాగ్రత్తలు, కొవిడ్ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు డిసెంబర్ 12 నుంచి మొదలవుతాయి. తొలుత పోటీదారులందరికీ ఆడిషన్స్, కొవిడ్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తాం.ఈ కార్యక్రమాలకు వారం రోజుల సమయం ఉంటుంది. ఆసక్తిగల తల్లులు/తండ్రులు 9503606049 లేదా 8247219948 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఈ సీజన్‌లో ప్రధానంగా సురక్షిత ప్రసవాల కోసం స్క్రీనింగ్, అవగాహన, శిక్షణ లాంటివి ఉంటాయి. దాంతోపాటు ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలందరి జీవితాల్లో నాణ్యతను మెరుగుపరిచే అంశాలుంటాయి. గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లు, విజేతలు పొందిన అనుభవాలు, జీవితకాలం పదిలపరచుకున్న జ్ఞాపకాల దొంతరలను సొంతం చేసుకుంటారా లేదా అన్నది మీ చేతుల్లోనే ఉంది.
మిసెస్ మామ్ 2020 పోటీ అంతా గర్భ సంస్కార యోగతో కాబోయే తల్లుల సంరక్షణ, వారికి అవగాహన, లామేజ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్, వోగా (వాటర్ యోగా), పోషకాహార ప్రాధాన్యం, ఆరోగ్యకరమైన వంట, దంతాల పరీక్షలు, చర్మసంరక్షణ, గ్రూమింగ్ సెషన్లు, ఒత్తిడి నివారణ, వ్యక్తిత్వ వికాసం, పిల్లల సంరక్షణ చిట్కాలు… ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఉంటాయి.
ఈ అలవాట్లన్నింటి వల్ల గర్భిణులకు సాధారణ ప్రసవం జరగడంతో పాటు, వాళ్లు గర్బధారణ సమయంలో సురక్షితంగా ఉండటం, ప్రసవంలోనూ క్షేమంగా ఉండటం, తత్ఫలితంగా ఎప్పటినుంచో కలలు కంటున్నట్లుగా బోలెడన్ని సంతోషకరమైన జ్ఞాపకాలు ఉంటాయి.
ఈ కార్యక్రమం గురించి కిమ్స్ కడిల్స్ ఆసుపత్రుల కన్సల్టెంట్ గైనకాలజిస్టు, ఆబ్స్టెట్రీషియన్ డాక్టర్ శిల్పి రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పటికి మేం మూడు సీజన్లు విజయవంతంగా, చాలా ఘనంగా నిర్వహించాం. అందులో కాబోయే తల్లుల నవ్వులు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించి, మద్దతు ఇచ్చిన మా స్పాన్సర్లు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మిసెస్ మామ్ 2020 నాలుగో సీజన్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దానివల్ల గర్భవతులు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, అన్ని వర్గాల వారికి ఇది అందుబాటులోకి వస్తుంది. స్వయంగా వచ్చి పాల్గొనలేనివారు కూడా దీన్ని ఆస్వాదించగలరు” అన్నారు.
“గర్భం దాల్చిన దంపతుల్లో ప్రతి ఒక్కరికీ దీనిపై పూర్తి అవగాహన ఉండేలా కార్యక్రమాలను సిద్ధం చేశాం. దీనిపై ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వంఎటనే వాటికి వైద్యనిపుణులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలోనైనా సమాధానాలు ఇస్తారు. కిమ్స్ కడిల్స్‌లో మేం ఎప్పుడూ గర్భిణులైన మహిళల సంరక్షణకు మనస్ఫూర్తిగా ముందుంటాం. వారి జీవితాలు బాగుండాలన్నదే మా లక్ష్యం. 2020లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అత్యంత సురక్షితంగా ఉంటుంది, మహిళలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం కూడా” అని ఆమె వివరించారు.











