కేసీఆర్‌కి చిరంజీవి, నాగార్జున సూప‌ర్ స్కెచ్ వేశారు

ఊళ్లో ఓ సామేత ఉండేది. కుండ‌లు, బిందెలు తీసుకవెళ్లార‌ని. ఇప్పుడు అలానే ఉంది తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ. దొంగ‌ల ప‌డిన అర్నేళ్ల‌కు కుక్క‌లు మోరిగిన‌ట్లు. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు ఎప్పుడో వ‌చ్చి స‌గం స‌ర్వనాశ‌నం అయి పోయిన త‌ర్వాత కానీ మ‌న హీరోల‌కుర వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌న్న సోయి లేకుండా పోయింది. చైన్నైలో మాత్రం అలా వ‌ర‌ద‌లు రాగానే ఇలా యూనియ‌న్లు, ఎవో ఎవో పేర్లు పెట్టుకొని డ‌బ్బులు పోగేసి ఆదుకున్నారు.
హైద‌ర‌బాద్‌లో మాత్రం వ‌ర్ష‌కాలంలో వ‌ర‌ద‌లు వ‌స్తే…. బాధితుల‌ను చ‌లికాలంలో ఆదుకోవ‌డాన‌కి ముందుకు వ‌చ్చారు ఇద్ద‌రు బ‌డా హీరోలు చిరంజీవి, నాగార్జున‌.
ఇది ఇలా ఉంటే బాధితుల‌ను ఆదుకుంటాం అని సాకుతో సీఎం కేసీఆర్‌ని క‌లిసిన వీళ్లు 2000 ఏక‌రాల‌కు ఏస‌రు పెట్టాశారు. క‌రోనాతో రాష్ట్రం విల‌విల‌లాడుతుంటే వీరికి ఇప్పుడు సినిమా సిటీ గుర్తుకువ‌చ్చింది. ఇందు కోసం న‌గ‌ర శివారులో 2000 ఏక‌రాలు ఇవ్వాడానికి ప్ర‌భుత్వం సుముఖ‌త చూపింది. అంటే ఇక్క‌డే మ‌నం అర్ధం చేసుకోవ‌చ్చు. ఎవ‌రి మీద సీఎం కేసీఆర్‌కి ప్రేమ ఉందో… చిరంజీవి నాగార్జున వేసిన సూప‌ర్ స్కేచ్‌లో సీఎం పూర్తిగా మునిగిపోయాడు. ఇప్ప‌టికే సినీ ప‌రిశ్ర‌మ పెద్ద పెద్ద హీరోయిన్లు, హీరోల‌తో మంత్రి కేటీఆర్‌కి కూడా మంచి సంబంధాలు ఉండ‌డ‌మే ఇది క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.