ఎమ్మెల్యే ర‌స‌మ‌యిని ఫోన్‌లో ఏసుకున్న సామాన్యుడు

మానకొండూరు ఎమ్మెల్యేకు ర‌స‌మ‌యికి ఓ సామాన్యుడు చెప్ప‌లేని బూతుల‌తో ఫోన్‌లో ఏసుకున్నాడు. అధికార అంకారంతో ఏది ప‌డితే అది మాట్లాడితే ప‌డేవారు ఎవ‌రూ లేర‌ని గ‌ట్టిగా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో పోటుగానిలా మాట్లాడాని ప్ర‌య‌త్నించిన ఎమ్మెల్యేకు రివర్స్ పంచ్ పడింది. వాట్సాప్‌లో ఎమ్మెల్యేపై పోస్టింగ్ పెట్టిన యువకుడికి చేసిన హెచ్చరికలు బెడిసి కొట్టాయి. సదరు యువకుడు ఏమాత్రం భయపడకుండా ఎమ్మెల్యేను కడిగి పడేశాడు. ఎమ్మెల్యేకు ఆ యువకుడికి జరిగిన ఫోన్ సంభాషన ప్రస్తుతం రాష్ట్రంలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ఆడియో ట్రెండ్ అవుతోంది.

‘ఏమయ్య బాబు.. నా గురించి బూతులు తిడుతూ సోషల్ మీడియాలో రోజు పోస్ట్ చేస్తున్నావ్ ఎందుకు..? ఏదో చదువుకున్న వాడివని ఇన్నిరోజులు వదిలేశా.. మళ్లీ పోస్ట్‌లు పెడితే ఊరుకోను.. జాగ్రత్త..’ అంటూ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. రాజశేఖర్ అనే యువడిని బూతులు తిడుతూ హెచ్చరించాడు. ఎమ్మెల్యే తిట్టినా.. మొదట ఓపిక పట్టిన రాజశేఖర్.. ఆ తర్వాత ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు. నీలాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టవద్దని.. వెంటనే రాజీనామా చేయ్.. నీ బెదిరింపులకు భయపడనని.. ఏం చేసుకుంటావో చేసుకో అని ఎమ్మెల్యేకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇరువురూ పచ్చి బూతులు తిట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో రాష్ట్రంలో ట్రెండింగ్ లో ఉన్నది. ఏదో చేద్దామనుకున్న ఎమ్మెల్యేకు మరేదో కావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అవాక్కవుతున్నారు.