న్యాయం చేయకుంటే నిరాహారదీక్ష చేస్తాం

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్ర‌తినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ :
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కూడా కొన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు.కొందరు తమ పలుకుబడి తమ రాజకీయ బలంతో ఒకరి భూమిని ఇంకొకరిపై పట్టాలు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామానికి చెందిన ఖిల్లారే శివాజీ మరియు ఖిల్లారే రామ్ కిషన్ అనే ఇద్దరు వ్యక్తులు తనకు జరిగిన అన్యాయాన్ని స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.తమకు జామిడి గ్రామ శివారులో గల 45 సర్వే నెంబర్లు తమ వారసత్వ భూమిని కొందరు ఇంటిపేరు(ఖిల్లారే) ఒకటే కావడంతో తమ రాజకీయ బలంతో కబ్జా చేసుకొని కాస్తులో పేర్లు రాసుకున్నారు వాపోయారు.కోర్టులో కేసు ఉన్న కూడ ఆఫీసర్లు తమ భూమిని వేరే వారి పేరు పైన మార్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు కేసు నడుస్తున్న క్రమంలో కూడా రాజకీయ పలుకుబడి ఉండడంతో ఆఫీసర్లు సైతం అతనికి సపోర్ట్ చేశారని కన్నీరుమున్నీరయ్యారు.అదేవిధంగ ఏజన్సీ ప్రాంతంమైన గేర్జం గ్రామ శివారులోని సర్వే నంబర్ 60/ఏ లో పది ఎకరాల భూమిని సైతం వ్యక్తి కబ్జా చేశాడని తెలిపారు.అది ఏజెన్సీ ప్రాంతమైన కూడా అధికారులు వాళ్ళ పేరిట భూమిని మార్పు చేశారని, ఏజెన్సీ లో 1/70 చట్టం ఉన్నా 2016 సంవత్సరం లో ఎలా మార్పులు చేసారని అధికారులను ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా కోర్టు చుట్టూ,ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగపోతే కుటుంబంతో సహా కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.
కోర్టులో కేసులు నడుస్తున్న అధికారులు తమకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు వేరే వారి పేరును నమోదు చేశారన్నారు.దీనికి నిరసనగా కోర్టు పత్రాలు చూపెట్టి తమ వ్యవసాయ భూమిలోకి వెళితే మా పైనే అక్రమంగా పోలీసు కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతూన్నారని వాపోయారు.ధన బలం,రాజకీయ పలుకుబడి వల్ల వారి నుండి తమకు హాని ఉందని తెలిపారు.వెంటనే ఆఫీసర్లు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు.లేనిపక్షంలో నిరాహారదీక్ష దీక్ష చేపడతామని చేపడతామని బాధితులు తెలిపారు.