నా మొగుడు మంచి అబ్బాయి : కాజల్
కాజల్ పెళ్లి ఓ వేడుకలా జరిగింది. ఎవరు ఎవరా అని ఎదురు చూస్తే గౌతమ్‌ని పెళ్లి చేసుకుంది కాజల్. అయితే అందరి భర్తల తన భర్త కాదని. అతనికి ఓ ప్రత్యేక ఉందని అంటున్నారు కాజల్. నా మొగుడు మంచి అబ్బాయి అని సర్టిఫికెట్ ఇచ్చేసింది. అయితే పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ…నేను మొదటి నుంచి మంచి పాత్రలు, మంచి సినిమాలే ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాను. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని విడివిడిగానే ఉంచాను. అవి ఎప్పుడూ అలానే ఉండాలని కూడా అనుకుంటాను. ఈ రెండిట్లో ఏదీ కూడా రెండోదాన్ని ప్రభావితం చేయకూడదు. పని చేస్తే దానికి వంద శాతం ఇవ్వాలి. అలాగే పర్శనల్ లైఫే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలన్నది నా అభిప్రాయం.











