కర్నూలు మేయర్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ?
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులుగా, మిత్రులగా మారుతారో చెప్పడం కష్టం. అప్పుడే మిత్రులుగా ఉన్నవారు శత్రువులు కావచ్చే. శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారవచ్చు. అయితే ఈ మార్పు పదవులను కూడా తెచ్చి పెట్టవచ్చే. ఇందుకు నిదర్శనమే మాజీ ఎంపీ బుట్టా రేణుకా.
ఒక్కప్పుడు వైకాపా నుంచి ఎంపీగా గెలిచి ఢిల్లీకి చేరిన అమె రాజకీయం చేశారు. ఎంతలా అంటే ఢిల్లీకి జగన్ వెళ్లిన కెమెరాలు అన్ని ఆమె వైపే చూసేవి. అందం, అనుకువా ఉన్న ఆమె రాజకీయ చతురతలో కాస్తా ఇబ్బంది పడ్డారు అనే చెప్పుకొవచ్చు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటి సారే కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత అనూహ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. తిరిగి 2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనను మోసం చేసిందంటూ మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరి సంచలనం సృష్టించారు బుట్టా రేణుక. గత ఎన్నికల్లో ఎలాంటి పదవి ఆశించకుండా భేషరతుగా పార్టీలో చేరి వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో వైసీపీ అధికారంలో వచ్చింది. అయితే మాజీ ఎంపీ బుట్టా రేణుక మాత్రం ఖాళీగా ఉండిపోయారు. మధ్యలో ఎమ్మెల్సీ పదవి దక్కబోతోందంటూ ప్రచారం జరిగినా అది అవాస్తవమని తేలింది. కర్నూలు రాజకీయాల్లో బుట్టా రేణుక కనుమరుగవుతోందని అందరూ అనుకుంటున్న తరుణంలో కీలకమైన పదవికి ఆమె పేరు వినిపిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్నూలు మేయర్ పీఠాన్ని బుట్టా రేణుకకు అప్పగించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
అయితే ఈ పదవికి కర్నూలులో గట్టి పోటీయే ఉంది. బుట్టా రేణుక మాదిరిగానే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. టీడీపీలోకి ఫిరాయించి, ఎన్నికల ముందు మళ్లీ జగన్ గూటికి చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి సైతం ఈ పదవి కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్యకు ఎలాగైనా మేయర్ స్థానం కోసం ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే బీసీ మహిళ అయిన బుట్టా రేణుక వైపే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ స్థానానికి బుట్టా రేణుకను ఎంపిక చేసినప్పుడు కూడా పార్టీలో విబేధాలు తలెత్తాయి. కానీ, సీఎం జగన్ ఆమె వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు కూడా సామాజిక పరిణామాల పరంగా చూసుకున్నా బుట్టా రేణుకనే ఎంపిక చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజకీయంగా కష్టకాలం ఎదుర్కొంటున్న బుట్టా రేణుకకు కర్నూలు మేయర్ పీఠం దక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.