మార్చిలో క‌రోనా వ్యాక్సిన్

ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకొని వ‌ణికిస్తున్న క‌రోనాకి మార్చిలో చెక్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌న్ని క‌రోన వ‌ల్ల ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాయి. కాస్తో కూస్తే కుద‌ట ప‌డుతుంది అనుకునే స‌మ‌యంలో మ‌ళ్లీ సెకెండ్ వేవ్ మొద‌లైంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై చేస్తున్న పరిశోధనలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి వ్యాక్సిన్ ను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియాటుడే తెలిపింది. కాగా కోవ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ మూడోదశలో ఉన్నాయి. త్వరితగతిన ట్రయల్స్ పూర్తి చేసి 2021, మార్చి నెలలో వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.