ఒకే కుటుంబంలో క‌రోనాతో న‌లుగురి మృతి

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ చాప కింద నీరులా విస్త‌రిస్తుంది. అప్ర‌మ‌త్తంగా లేకుంటే ప్రాణాల‌కే ప్ర‌మాదంగా త‌యారైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌లోని ఓ న్యాయ‌వాది కుటుబంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా న‌లుగురు మృతి చెందారు. న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబంలో అక్టోబర్ 8న న్యాయవాది తల్లి మరణించగా, అక్టోబర్ 30న న్యాయవాది భార్య కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను మచిలీపట్నంలో నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది ముసావీ కూడా తుదిశ్వాస విడిచారు. వారి కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో కుమారుడు కూడా మరణించారు. కుటుంబం మొత్తం కరోనాతో మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.