తెలంగాణ సర్కార్‌ని దుమ్ముదులిపిన జర్నలిస్ట్ జయసారధి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంతో మంది పోటీ పడుతున్నా… ఇప్పుడు మూడు జిల్లాల్లో ఒక్క పేరే మాత్రమే తెరమీద చెక్కర్లు కొడుతుంది. పట్టభద్రులు పట్టం కడితే ఆయనకే కట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రశ్నించే తత్వం ఆయన రక్తంలోనే ఉందని విద్యావంతులు డిసైడ్ అయ్యారు. ఏమాత్రం అనుమానం లేకుండా మొదటి ప్రాధాన్యత ఓటు అతనిదే అని వినిపిస్తోంది. ఇంతకి అతను ఎవరూ, ఆ జర్నలిస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
జయసారధిరెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన మహబూబాబాద్‌లో ఎర్రజెండాను నమ్ముకున్న కుటుబంలో జన్మించారు. ప్రశ్నించే గుణం ఆయన రక్తంలోనే ఉంది. ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా ప్రశ్నించే తత్వం ఆయనది.
ఈ ఎమ్మెల్సీ బరిలో తప్పకుండా యువతో పాటు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఆయనకే పట్టం కట్టాలని చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులగా మూడు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నా ఆయన ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఇప్పటి వరకు ప్రజలకు అవసరమైన ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా సర్కార్ చేయలేదని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులను మధ్యలో ఆపేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. కేసీఆర్ రైతు లెక్కలన్ని ఆయన మాట్లాల్లోనే ఉన్నాయని విమర్శించారు. కాళేశ్వరంతో పేద రైతుల ఆకలి తీరుస్తా అని చెప్పి వారి ఆకలి తీర్చకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి జాతకం తన చేతిలో ఉందని సరైన సమయం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయట పెడుతామన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్, హన్మకొండలో వరదుల వస్తే ఆదుకొకుండా ప్రజలపై, గత పాలకులు అంటూ సొల్లు కబర్లు చెప్పి తప్పించుకుందన్నారు. వరదలు ఎక్కడైన వరదలే కదా హైదరాబాద్‌లో నీట మునిగి ఇండ్లకు పదివేలు ఎందుకిచ్చారు. వరంగల్ ప్రజలు చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే అక్కడ డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. అందులో కూడా కకృతి పడ్డ తెరాస నాయకులు చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపించారు.
ఏది ఏమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో యువత ప్రశ్నించే జయసారధికే పట్టం కడతారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.