గిద్దలూరు వైకాపాలో ముదురుతున్న ముసలం
గిద్దలూరు వైకాపాలో రోజు రోజుకు అసమ్మతి నేతలు బయటపడుతున్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు. 2014 లో అధికారంలోకి రాకపోయేసరికి అనేకమంది టీడీపీ లో చేరారని, ఇప్పుడు ఆ పార్టీ నుండి తిరిగి వైకాపాలో చేరి పెత్తనం చేలాయిస్తున్నారు అని స్థానిక నేతలు వాట్సప్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై పలు టీవి ఛానెల్స్, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని ఎమ్మెల్యే స్పందించారు. అయితే అవి తప్పుడు వార్తలు అయితే ఎమ్మెల్యే అంతగా ఎందుకు స్పందించాలి అని పార్టీ లోని కింది స్థాయి నేతలు అంటున్నారు. 2014 నుండి పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన ఐవి రెడ్డి సీఎం జగన్ పక్కన పెట్టడం ఆయన చేసిన పెద్ద తప్పు అని మరో వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికల సమయం కూడా కాదు ఇలాంటి తరుణంలో పార్టీలో వ్యతిరేక పవనాలు వియడానికి గల కారణం ఏంటి అని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అన్నా రాంబాబు ఒక వర్గం నేతలకు మాత్రమే సహాయం చేస్తున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి.