కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారు : అరుణ
హైదరాబాద్ కి దుబ్బాక ఉప ఎన్నికలకు ఏంటి సంబంధం ఉందని ప్రశ్నిచారు సిద్ధిపేట బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణ. మంత్రి మతి తప్పి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికలు జరిగితే వాటిని హైదరాబాద్ కి లింక్ ఎలా పెడుతారు అని అన్నారు. మా పార్టీ వారు కూడా ఏమి చేయాలో మీరే చెబితే ఎలా అని గట్టిగా అడిగారు. అల్లర్లు సృష్టించిన సానుభతి పొందాలని మేము చూడడం లేదన్నారు. అలాంటి నీచమైన ఆలోచనలు మీకే వస్తాయన్నారు. వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె.