నార్సింగిలో బండి సంజయ్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ఫోటో : నవీన్

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెరాస భాజపా లకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా శత్రుత్వం పెరిగింది. అంతేకాకుండా పదవులకు రాజీనామా చేస్తాము అనే అంశం నుండి ఉరి వేసుకుని చచ్చిపోతా అనే దాకా సవాలు విసురుతున్నారు. అయితే దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్ మండలం లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున నినాదాలతో మార్మోగింది. ఈ ఈ ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరాడు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే దుబ్బాక చౌరస్తాలో ఉరేసుకుంటా నని బండి సంజయ్ అన్నారు ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది.